MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Budget Smartphone : కేవలం ఏడు వేలకే.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం..!

Budget Smartphone : కేవలం ఏడు వేలకే.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం..!

లావా కంపెనీ తన కొత్త 'బోల్డ్ N2 ప్రో' మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.7,999. ఈ బడ్జెట్ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 128GB స్టోరేజ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఇచ్చారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 04 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియన్ బ్రాండ్ లావా నుండి సరికొత్త ఫోన్..
Image Credit : LAVA

ఇండియన్ బ్రాండ్ లావా నుండి సరికొత్త ఫోన్..

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో సామాన్య ప్రజలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా.  బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా కొత్త బోల్డ్ N2 ప్రో మోడల్‌ను పరిచయం చేసింది. కేవలం రూ.7,999 ధరకే ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉండటంతో ఈ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లావా స్మార్ట్ ఫోన్ ఫీచర్లివే..
Image Credit : Lava

లావా స్మార్ట్ ఫోన్ ఫీచర్లివే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, సూపర్ స్మూత్ అనుభవం ప్రత్యేక ఆకర్షణ. ఇది 6.75 అంగుళాల HD+LCD స్క్రీన్‌తో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దీనివల్ల స్క్రోలింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమ్స్, సోషల్ మీడియా వాడేటప్పుడు ఈ స్మూత్‌నెస్ బాగా నచ్చుతుంది.

36
తక్కువధరలో వేగవంతమైన ఫోన్
Image Credit : Lava

తక్కువధరలో వేగవంతమైన ఫోన్

ఈ లావా బోల్డ్ N2 ప్రో ఫోన్ పనితీరు బాగుంది. ఇందులో యూనిసోక్ T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది రోజువారీ పనులకు మంచి వేగాన్ని అందిస్తుంది. వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ స్మూత్‌గా పనిచేస్తాయి. కానీ హెవీ గేమింగ్ లేదా హై-గ్రాఫిక్స్ గేమ్స్‌కు ఇది సరిపోదు.

46
50MP కెమెరా స్మార్ట్ ఫోన్..
Image Credit : Lava

50MP కెమెరా స్మార్ట్ ఫోన్..

ఈ లావా బోల్డ్ N2 ప్రో ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ధరలో 50MP కెమెరా రావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. సాధారణ ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఇది మంచి క్వాలిటీ ఇస్తుంది. రోజూ ఫొటోలు తీసుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

56
ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వర్క్..
Image Credit : LAVA

ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వర్క్..

ఈ ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే, ఇందులో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రూ.8,000 లోపు 128GB స్టోరేజ్ దొరకడం చాలా అరుదు. ఇది ఈ ఫోన్‌లోని అతిపెద్ద హైలైట్.

66
ఏప్రిల్ 6 నుండి అందుబాటులో..
Image Credit : Lava

ఏప్రిల్ 6 నుండి అందుబాటులో..

లావా బోల్డ్ N2 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనికి IP54 డస్ట్ & స్ప్లాష్ ప్రొటెక్షన్ ఉంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ఫోన్‌ను వేగంగా అన్‌లాక్ చేయొచ్చు. ఈ ఫోన్‌ను ఇండియాలో రూ.7,999కి లాంచ్ చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి. హెవీ గేమింగ్ చేయని యూజర్లకు ఇది సరైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
భారత దేశం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Related Stories
Recommended image1
Tech Tips: మొబైల్ ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ గోవిందా!
Recommended image2
Tech News: బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌తో క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇందులో నిజ‌మెంత‌..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved