MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Jio Free Data : డేటా అయిపోయినా నాన్ స్టాప్ ఇంటర్నెట్.. జియో యూజర్స్ కి ఫ్రీగా బోనస్ డేటా

Jio Free Data : డేటా అయిపోయినా నాన్ స్టాప్ ఇంటర్నెట్.. జియో యూజర్స్ కి ఫ్రీగా బోనస్ డేటా

మీరు ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటారా? అయితే కొన్నిసార్లు డేటా లిమిట్ అయిపోవడంతో ఇంటర్నెట్ నిలిచిపోయిన అనుభవం మీకు ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉచితంగా బోనస్ డేటా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎవరికో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 08 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో యూజర్స్ కి సూపర్ ఛాన్స్.. ఉచితంగా బోనస్ డేటా
Image Credit : Gemini AI

జియో యూజర్స్ కి సూపర్ ఛాన్స్.. ఉచితంగా బోనస్ డేటా

స్మార్ట్ ఫోన్ వాడే ఎవరైనా ప్రతిరోజు కొంత ఇంటర్నెట్ డేటా లిమిట్ తో మంత్లీ లేదా క్వాటర్లీ లేదంటే ఇయర్లీ రీచార్జ్ ప్లాన్ ఎంచుకుంటారు. తక్కువ డేటా వాడుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ డేటా వాడుకునేవారికి ఓ ఇబ్బంది ఉంటుంది. డేటా లిమిట్ అయిపోగానే ఇంటర్నెట్ ఆగిపోతుంది.. ఆన్లైన్ పనులు, ఆఫీస్ మెయిల్స్, వాట్సాప్ అప్‌డేట్స్, సోషల్ మీడియా వాడకం నిలిచిపోతుంది. దీంతో ఎక్స్ట్రా డేటా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలా మళ్లీమళ్లీ రీచార్జ్ చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని… అలాగని ఇంటర్నెట్ వాడకుంటే పనులు కావు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చింది. 

రిలయన్స్ జియో యూజర్లు అదనపు డేటా రీచార్జ్ అవసరం లేకుండానే రోజువారి డేటా లిమిట్ అయిపోయినా నాన్ స్టాప్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఇలా ఉచితంగా బోనస్ రీచార్జ్ అందించే రీచార్జ్ ప్లాన్స్ ను జియో సిద్దం చేసింది. ఇలాంటి సూపర్ రీచార్జ్ ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
5 జీబీ డేటా ఉచితంగా అందించే జియో రీచార్జ్ ప్లాన్ ఇదే..
Image Credit : Getty

5 జీబీ డేటా ఉచితంగా అందించే జియో రీచార్జ్ ప్లాన్ ఇదే..

జియో కస్టమర్లు రూ.459తో రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2GB డేటా చొప్పున 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 56GB డేటా వస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు జియో బోనస్‌గా 5GB డేటాను ఉచితంగా అందిస్తోంది… అంటే రోజువారి డేటా లిమిట్ పూర్తయితే ఈ 5GB డేటా వాడుకోవచ్చన్నమాట. మొత్తంగా 28 రోజులకు 61GB డేటా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ లో డేటాతో పాటు 100 SMS, జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో, జియో హాట్‌స్టార్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Related Articles

Related image1
Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?
Related image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
35
ఏకంగా 20 జీబీ ఉచిత బోనస్ డేటా..
Image Credit : Gemini

ఏకంగా 20 జీబీ ఉచిత బోనస్ డేటా..

జియో కస్టమర్లు రూ.749 లేదా రూ.899 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే మూడు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లలో రోజూ 2GB డేటా వస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా అయిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ప్లాన్‌ లో అదనంగా 20GB బోనస్ డేటా లభిస్తుంది. అవసరమైనప్పుడు ఈ డేటాను వాడుకోవచ్చు.

45
5 జీబీ బోనస్ డేటా ప్లాన్
Image Credit : gemini ai

5 జీబీ బోనస్ డేటా ప్లాన్

జియో కస్టమర్లు రూ.495 లేదా రూ.545 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, రోజూ వరుసగా 1.5GB, 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మీ రోజువారీ డేటా కోటా అయిపోయిన తర్వాత, అదనంగా లభించే 5GB ఉచిత డేటా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

55
డేటా రీఛార్జ్ కిరికిరి లేదు
Image Credit : Getty

డేటా రీఛార్జ్ కిరికిరి లేదు

వ్యాలిడిటీ ఉంది కానీ డేటా అయిపోయింది…ఈ సమస్యను ఎదుర్కొనే వారు బోనస్ డేటా లభించే ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల డేటా గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నేహితులకు, ఇతరులకు ఫోన్ చేసి డేటా రీఛార్జ్ చేయమని అడిగే టెన్షన్ తప్పుతుంది. నాన్ స్టాప్ గా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Safety Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Recommended image2
Nothing Phone (4b): నథింగ్ నుంచి కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో, లగ్జరీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్
Recommended image3
Induction Safety: వ‌ర్షాకాలంలో ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ను వాడుతున్నారా.? ఈ త‌ప్పులు చేస్తే క‌రెంట్ షాక్ కొడుతుంది
Related Stories
Recommended image1
Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?
Recommended image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved