iQOO Z10 Lite 5G : 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ.. సూపర్ ఫీచర్లతో ఐక్యూ Z10 లైట్ 5G
iQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G జూన్ 18న భారత్‌లో విడుదల కానుంది. దీంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ ఉంటాయని సంస్థ వెల్లడించింది.

భారత్‌లోకి iQOO Z10 Lite 5G
ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Z సిరీస్ లో భాగంగా ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ (iQOO Z10 Lite 5G) ను జూన్ 18న భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆన్ లైన్ షాపింగ్ మైక్రోసైట్ అమెజాన్‌లో ఐక్యూ వెల్లడించింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా వెల్లడయ్యాయి.
iQOO Z10 Lite 5G ముఖ్య ఫీచర్లు, హార్డ్‌వేర్, కెమెరా, డిజైన్
ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ (iQOO Z10 Lite 5G) లో మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 6300 చిప్‌సెట్ ఉంటుంది. ఫోన్ రెండు రంగుల్లో వస్తుంది. అవి టిటానియం బ్లూ, సైబర్ గ్రీన్ కలర్లు.
ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇది ఫ్లాష్‌లైట్‌తో పాటు నిలువు ఆకారంలో ఉంది. ప్రధాన కెమెరా 50MP Sony సెన్సార్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది.
iQOO Z10 Lite 5G : సెక్యూరిటీ, స్మార్ట్ ఫీచర్లు
iQOO Z10 Lite 5G కి IP64 రేటింగ్ ఉంది, అంటే ఇది ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కలిగి ఉంటుంది. కెమెరా అనుభవాన్ని మెరుగుపరిచేందుకు AI ఆధారిత ఫీచర్లు తీసుకొచ్చారు. AI Erase, AI Photo Enhance మొదలైనవి ఇందులో ఉంటాయి.
iQOO Z10 Lite 5G : భారీ బ్యాటరీ, దీర్ఘకాలిక బ్యాకప్
ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ తో వస్తుంది. సంస్థ తెలిపిన ప్రకారం, ఈ ఫోన్ 70 గంటలు పాటలు వినవచ్చు. 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్, 9.17 గంటల గేమింగ్ బ్యాకప్ ఇస్తుంది. ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
iQOO Z10 Lite 5G: డిస్‌ప్లే, మెమొరీ, ఆపరేటింగ్ సిస్టమ్
ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ ఫోన్‌లో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది.
iQOO Z10 Lite 5G ధర ఎంత?
iQOO Z10 Lite 5G ఈ ఫోన్ ధర, మరిన్ని స్పెసిఫికేషన్లపై పూర్తి వివరాలు జూన్ 18న అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది. అమెజాన్ ప్లాట్‌ఫాం ద్వారా అమ్మకానికి లభించనుంది. దీని అంచనా ధర 12,990 రూపాయల నుంచి ప్రారంభం కావచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.