Infinix Hot 12 Play:బిగ్ బ్యాటరీతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. బెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి లాంచ్..
ఇన్ఫినిక్స్ (Infinix)ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే (Infinix Hot 12 Play)ని లాంచ్ చేసింది. కొత్త ఫోన్ గత ఏడాది నవంబర్‌లో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 11 ప్లేకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే డ్యూయల్ రియర్ కెమెరాలు, 6000mAh బ్యాటరీతో పరిచయం చేసారు.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే Unisoc T610 ప్రాసెసర్‌తో 64జిబి స్టోరేజ్ పొందుతుంది. ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
ధర
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే ధర రూ. 8,499. ఈ ధరతో 4జిబి ర్యామ్ తో 64జిబి స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్‌ను సున్ షైన్ గోల్డ్, డేలైట్ గ్రీన్, హారిజన్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ Infinix ఫోన్ సేల్ Flipkartలో మే 30 నుండి ప్రారంభమవుతుంది.
స్పెసిఫికేషన్‌లు
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే Android 11తో XOS 10ని పొందుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 480 నిట్స్, UniSoc T610 ప్రాసెసర్ ఇచ్చారు, ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 4జిబి ర్యామ్‌తో 3జిబి వర్చువల్ ర్యామ్‌ను కూడా పొందుతుంది. ఫోన్ లో 64 జిబి స్టోరేజ్ ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లేలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్, దానితో పాటు క్వాడ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఇతర లెన్స్‌ల గురించి సమాచారం ఇవ్వలేదు. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
కనెక్టివిటీ కోసం ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లేలో 4G LTE, WCDMA, GSM, Wi-Fi 02.11 a/b/g/n, బ్లూటూత్ v5, GPS/ A-GPS అండ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ 10W ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది