MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • వీడియోలను చూడడంలో చైనాను అధిగమించిన భారత్.. ప్రజలు రోజుకు ఎన్ని గంటలు మొబైల్ పై గడుపుతున్నారంటే?

వీడియోలను చూడడంలో చైనాను అధిగమించిన భారత్.. ప్రజలు రోజుకు ఎన్ని గంటలు మొబైల్ పై గడుపుతున్నారంటే?

 కరోనా మహమ్మారి ప్రజల దినచర్యను మార్చివేసింది. గతంతో పోలిస్తే సాధారణ వ్యక్తులు మొబైల్ స్క్రీన్ చూసే సమయం పెరిగింది. మొబైల్ వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్ పై రోజుకు 4.8 గంటలు గడుపుతున్నారు. సగటున ఒక గంట పాటు వీడియోలు చూస్తూ గడుపుతారు. కరోనా లాక్ డౌన్ నుండి వీరి సంఖ్య 350 మిలియన్లను దాటిందని ఒక నివేదికలో వెల్లడైంది. 2018తో  2020 పోలిస్తే వీరి వారి సంఖ్య 24 శాతం పెరిగింది ఈ గణాంకాలు  చైనా కంటే రెండింతలు ఎక్కువ.

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 13 2021, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బైన్ అండ్ కో ద్వారా 'ఆన్‌లైన్ వీడియో ఇన్ ఇండియా - కీ యాస్పెక్ట్స్' ఇటీవల విడుదల చేసిన నివేదికలో కరోనా(corona) వ్యాప్తి వల్ల దేశవ్యాప్త లాక్ డౌన్(lock down) సమయంలో ప్రజలు ఆన్‌లైన్ వీడియో(online video)లను ఎక్కువగా చూస్తున్నారని తేలింది. ప్రజలు వీడియోలను చూడటానికి గడిపే సమయం 60 నుండి 70 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం, భారతదేశంలో ఈ గణాంకాలు మరింత వేగంగా పెరుగుతాయి. నేడు భారతదేశంలో 60 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు వీడియోలను ఆన్‌లైన్‌లో చూస్తుండగా, చైనాలో ఈ సంఖ్య 90 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో దాదాపు 640 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు, వారిలో 550 మిలియన్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పొడవైన వీడియోలు
ఈ నివేదికలో 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు పొడవైన వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారని  వెల్లడైంది. అయితే ప్రజలు చిన్న వీడియోలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారట. పెద్ద వీడియోలను చూసే వారి సంఖ్య ఇంతకుముందు కంటే ఇప్పుడు  ఎక్కువగా పెరిగింది. 2018తో  2020  పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు పెరుగుదల ఉంది. కరోనా లాక్ డౌన్ ఊన్నప్పటి నుండి యాక్టివ్ యూజర్లు రోజుకి 2.5 గంటల కంటే ఎక్కువ నిడివి గల వీడియో ప్లాట్‌ఫారమ్‌లో గడుపుతున్నట్లు తెలుస్తుంది. అలాంటి వినియోగదారులు 2025 సంవత్సరం నాటికి 50 కోట్ల నుండి 65 కోట్లకు పెరుగుతారని అంచనా. ఈ నివేదికలో విశ్లేషకులు 15 సెకన్ల నుండి రెండు నిమిషాల వ్యవధి గల వీడియోలను చిన్న వీడియోలుగా రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి వీడియోలను పొడవైన వీడియోలుగా పరిగణించారు.
 

34

టిక్‌టాక్ వచ్చిన తర్వాత వీడియో మార్కెట్ 
భారతదేశంలో చిన్న వీడియోల మార్కెట్ టిక్‌టాక్(tiktok) రాకతో ప్రారంభమైంది. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ పై  భారతదేశం నిషేదించినప్పటికి  షార్ట్ వీడియో(short videos) క్రేజ్ నిరంతరం పెరుగుతు వస్తుంది. షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల సంఖ్య 3.5 రెట్లు పెరిగింది. ప్రజలు షార్ట్ వీడియోస్ పై  సమయాన్ని కేటాయించడం కూడా 12 రెట్లు పెరిగింది. 

44

 2020 సంవత్సరంలో కనీసం 200 మిలియన్లకు పైగా భారతీయులు చిన్న వీడియోలను చూస్తున్నారు. యాక్టివ్ యూజర్ ప్రతిరోజూ ఈ ప్లాట్‌ఫారమ్‌లపై 45 నిమిషాల వరకు గడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ (ఫేస్‌బుక్), యూట్యూబ్ (గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద కంపెనీలు చిన్న, పెద్ద వీడియోలపై దృష్టి సారిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద వీడియోలను అందించే యూట్యూబ్, చిన్న వీడియోల కోసం యూట్యూబ్ షాట్‌లతో కూడా ముందుకు వచ్చింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Recommended image2
రాత్రుళ్లు పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు ఉందా.? మీకోస‌మే ఈ బుక్ రీడింగ్ లైట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved