8 ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ సెన్సార్‌తో హానర్ సరికొత్త స్మార్ట్ వాచ్.. వారి కోసం ప్రత్యేకంగా లాంచ్..
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక కొత్త స్మార్ట్ వాచ్ హానర్ వాచ్ జిఎస్ 3ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎనిమిది ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ (పిపిజి) సెన్సార్‌తో కంపెనీ నుండి వస్తున్న మొదటి స్మార్ట్ వాచ్. ఈ పిపిజి సెన్సార్ ద్వారా ఖచ్చితమైన హార్ట్ రేట్ మానిటరింగ్ క్లెయిమ్ చేయబడింది.
ఈ స్మార్ట్ వాచ్ తో పాటు కంపెనీ హానర్ వి7 ప్రో ట్యాబ్‌ని కూడా ప్రవేశపెట్టింది, ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు.
హానర్ వాచ్ జిఎస్ 3 ధర గురించి ప్రస్తుతం అధికారిక సమాచారం లేదు. ఈ స్మార్ట్ వాచ్ సిల్వర్, బ్లూ వాయేజర్ కలర్‌లో లాడర్ స్ట్రాప్ అండ్ స్ట్రిమ్మర్ క్లాసిక్ గోల్డెన్ కేస్‌తో కొనుగోలు చేయవచ్చు. గ్లోబల్ మార్కెట్లో దీని లభ్యత గురించి ఎలాంటి వెల్లడించలేదు.
హానర్ వాచ్ జిఎస్ 3 ఫీచర్లు
హానర్ వాచ్ జిఎస్ 3 స్మార్ట్ వాచ్ అనేది గత సంవత్సరం లాంచ్ చేసిన హానర్ వాచ్ జిఎస్ ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ వాచ్ గుండ్రటి డయల్ డిజైన్ తో వస్తుంది. అంతేకాకుండా ఎనిమిది-ఛానల్ పిపిజి సెన్సార్ ఇందులో ఉపయోగించారు, దీనికి కృత్రిమ మేధస్సు సపోర్ట్ కూడా ఉంది. బెస్ట్ డిజైన్, అక్యురేట్ హెల్త్ మానిటర్ రిపోర్ట్ ఇష్టపడే వారి కోసం ఈ వాచ్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడినట్లు కంపెనీ పేర్కొంది. దీనికి రెండు ఫిజికల్ బటన్లు లభిస్తాయి.