నానో బనానా : 3D మోడల్ ఫోటోలను వీడియోగా మార్చడం ఎలాగో తెలుసా?
Gemini Nano Banana AI Video Guide: జెమినీ నానో బనానా AI తో పాటు Grok AI, Kling AI ద్వారా కూడా మీ 3D ఫోటోలను సులభంగా వీడియోలుగా మార్చవచ్చు. త్రీడీ మోడల్ ఫోటోలను వీడియోలుగా ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నానో బనానా AI: కొత్త ట్రెండ్
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్న టూల్ జెమినీ నానో బనానా AI. ఈ మోడల్ ఇప్పటివరకు 200 మిలియన్లకు పైగా ఇమేజీలు, 3D మోడళ్లను సృష్టించింది. గూగుల్ ఆధునిక సాంకేతికతలో భాగంగా, యూజర్లకు సాధారణ ఫోటోలను దీంతో 3D మోడల్స్, ఫిగరైన్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో సృష్టించడం లేదా మార్పులు చేసే అవకాశం ఇస్తోంది. కేవలం ఒక్క టెక్స్ట్ ప్రాంప్ట్‌తోనే మీరు త్రీడీ మోడల్ ఫోటోలను క్రియేట్ చేయడంతో పాటు వాటికి మరిన్ని హంగులు చేయవచ్చు.
జెమినీ ఏఐ నానో బనానా ప్రత్యేకతలు ఏంటి?
నానో బనానా AI ద్వారా సృష్టించిన 3D మోడల్స్‌లో రియలిస్టిక్ లైటింగ్, టెక్స్చర్స్, పర్స్పెక్టివ్ స్పష్టంగా చూపిస్తూ అద్బుతంగా ఉంటాయి. అందుకే క్రియేటర్లు, డిజైనర్లు, AI అభిమానులు ఈ టూల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోటోలు 3D మోడల్స్‌గా మారడం ఆకర్షణీయంగా ఉంటే, వాటిని వీడియోలుగా మార్చడం మరింత కొత్త అనుభూతిని అందిస్తోంది.
అయితే Google Veo 3, OpenAI Sora వంటి వీడియో జనరేషన్ టూల్స్ ఎక్కువగా పేమెంట్ తో కూడుకున్నవి. అయితే, మీరు ఈ సేవలను ఉచితంగా కూడా పొందవచ్చు. అలాంటి ఫీచర్లను అందించే ఏఐలో ముందుగా కనిపించే వాటిలోGrok AI, Kling AI, perplexity ai లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి సులభంగా 3D ఫోటోలను వీడియోలుగా మార్చుకోవచ్చు.
#Gemini#NanoBanana AI #Video Guide to Turn #3D#Photos into Videos #Grok AI #Kling AI pic.twitter.com/Nm2LpENRcv
— mahe (@mahe950) September 13, 2025
Grok AI తో 3D ఫోటోలను వీడియోలుగా మార్చడం ఎలా?
xAI రూపొందించిన Grok AI ద్వారా యూజర్లు త్వరగా 3D ఫోటోలను యానిమేట్, వీడియోలుగా మార్చవచ్చు. అదనంగా దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా జోడించవచ్చు.
ఎలా చేయాలి?
1. మీ ఫోన్‌లో Grok యాప్ ఓపెన్ చేయండి లేదా X ద్వారా యాక్సెస్ చేయండి.
2. “Imagine” సెక్షన్‌కి వెళ్లండి.
3. నానో బనానా 3D మోడల్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
4. “Make Video” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. కొన్ని సెకన్లలోనే చిన్న యానిమేటెడ్ వీడియో సిద్ధమవుతుంది. దాన్ని సేవ్ చేసుకోవచ్చు లేదా మరో వెర్షన్ కావాలంటే మళ్లీ రీజనరేట్ చేయవచ్చు.
Kling AI తో సినిమాటిక్ వీడియోలు
Kling AI మరింత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇందులో స్మూత్ కెమెరా మోషన్స్, రియలిస్టిక్ యానిమేషన్స్ ఉన్నాయి.
ఎలా చేయాలి?
1. Kling AI వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి.
2. Gmail లేదా ఇమెయిల్ ద్వారా సైన్ ఇన్ చేయండి.
3. సైడ్ బార్‌లోని వీడియో ఆప్షన్ ఎంచుకోండి.
4. మీ 3D ఫోటోను అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వండి.
5. DeepSeek R1 ద్వారా ఆటో ప్రాంప్ట్ కూడా ఉపయోగించవచ్చు.
బెస్ట్ రిజల్ట్ కోసం మీరు ఇలాంటి ప్రాంప్ట్ ను ఉపయోగించవచ్చు:
“Keep the figurine mostly static while adding natural micro-movements such as blinking, light breathing, and minimal hand gestures. Animate the scene with cinematic camera motions including smooth pans, zooms, and rotations. Place the figurine inside a well-lit indoor environment with realistic lighting effects, soft shadows, and natural reflections for maximum realism.”
మీ సొంత 3D మోడల్ ఫోటోను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
మీరు కేవలం ఫోటోలను వీడియోలుగా మార్చడమే కాకుండా, మీ సొంత 3D మోడల్ ఫోటోను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
1. Gemini యాప్ ఓపెన్ చేసి Nano Banana ఆప్షన్ ఎంచుకోండి.
2. మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
3. దీనికి మీరు ఉదాహరణగా ఈ ప్రాంప్ట్ ను ఉపయోగించండి: “Create a highly detailed 1/7 scale figurine of the person in the photo. Place it on a desk using a transparent acrylic base. Design a premium toy-style packaging box around the figurine, featuring original illustrations, realistic textures, and attention to fine details for a collectible-quality display.”
ఇలా మీరు 3D మోడల్ ఫోటోలను సృష్టించి, వాటిని తర్వాత వీడియోలుగా కూడా మార్చుకోవచ్చు.