ఆపిల్ మౌస్‌కి పోటీగా గేమర్స్ కోసం కొత్త స్టైలిష్ వైర్‌లెస్ మౌస్.. ధర కూడా తక్కువే
భారతదేశంలో గేమింగ్ హెడ్‌ఫోన్‌లను లాంచ్ చేసిన తరువాత ఫ్రెంచ్ కంపెనీ జూక్ స్టైలిష్ గేమింగ్ మౌస్ జూక్ బ్లేడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జూక్ బ్లేడ్ మౌస్ ఆపిల్ మౌస్‌తో సమానంగా ఉంటుంది. జూక్ బ్లేడ్‌లో రబ్బరు స్క్రోల్ వీల్ కూడా ఉంది, ఇది స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు.
జూక్ బ్లేడ్ గేమింగ్ మౌస్ ఎల్‌ఈడి బ్యాక్‌లైట్‌తో వస్తుంది. అంతేకాకుండా ఏడు వేర్వేరు రంగులలో లభిస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు గేమ్ దృష్టిని మళ్లించకుండా ఎల్‌ఈడి లైట్‌ను కూడా ఆపివేయవచ్చు. దీని బాడీ ఎబిఎస్ ప్లాస్టిక్ తో తయారుచేశారు.
జూక్ బ్లేడ్ అనేది 600mAh లిథియం అయాన్ బ్యాటరీతో రీఛార్జ్ చేయగలిగే గేమింగ్ మౌస్. మౌస్ బ్యాటరీని యూఎస్‌బి కేబుల్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా మౌస్ మరొక ఫీచర్ ఏంటంటే దీనికి మల్టీ స్టేజ్ ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంది. ఇంకా ఆటో స్లీపింగ్ మోడ్ కూడా ఉంది. 10 నిమిషాలు మౌస్ ఉపయోగించకపోతే మౌస్ స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్తుంది.
ఈ గేమింగ్ మౌస్ లో 2.4జి వైర్‌లెస్ టెక్నాలజీ ఉంది. దీన్ని ఉపయోగించడానికి డ్రైవర్ అవసరం లేదు. దీనికి త్రీ స్పిడ్స్ 800/1200/1600 ఉంది. దీన్ని విండోస్ 7/8/10 / ఎక్స్‌పి, విస్టా 7/8, మాక్ ఇంకా లైనక్స్‌లో ఉపయోగించవచ్చు. జూక్ బ్లేడ్ ధర రూ.999 దీనిని ఆఫ్‌లైన్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయవచ్చు.