గూగుల్‌కు ఫ్రాన్స్ భారీ జరిమానా.. అలా చేయకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిక..
పారిస్: ఫ్రాన్స్ దేశ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 మిలియన్ యూరోలు అంటే భారతదేశ కరెన్సీలో రూ.4,415 కోట్లు ఫైన్ వేసింది. యు.ఎస్ టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే రెండు నెలల్లో వార్తా సంస్థలు, ఇతర పబ్లిషర్స్ న్యూస్ కంటెంట్ వినియోగం కోసం ఎలా పరిహారం ఇస్తుందనే దానిపై ప్రతిపాదనలు రావాల్సి ఉంది.
ఈ ఒప్పందాన్ని అమలు చేయడంలో గుగూల్ విఫలమైంది. ఆల్ఫాబెట్ ఇంక్ యూనిట్ తన గూగుల్ న్యూస్ సేవలో వ్యాసాల స్నిప్పెట్లను ప్రదర్శించడమే వివాదానికి కారణం అయింది. ఈ జరిమానా ఒక సంస్థకు ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యాంటీట్రస్ట్ పెనాల్టీ అని తెలుస్తోంది. "500 మిలియన్ యూరోల జరిమానా అంటే ఉల్లంఘనల యొక్క తీవ్రత స్పష్టంగా తెలుస్తుందని ఫ్రెంచ్ ఏజెన్సీ అధ్యక్షుడు ఇసాబెల్లె డి సిల్వా అన్నారు. ఒకవేళ అలా చేయకపోతే రోజుకు 900,000 యూరోల వరకు అదనపు జరిమానాను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
గ్లోబల్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కలిగి ఉన్న ఎజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు గూగుల్ తెలిపింది. జరిమానాపై గూగుల్ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. మరోవైపు గూగుల్ మంగళవారం జరిమానా ప్రకటనపై అప్పీల్ చేసే అవకాశం ఉంది.
యాంటీట్రస్ట్ అథారిటీ జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను గూగుల్ ఉల్లంఘించిందా అనే దానిపై ఈ కేసు దృష్టి సారించింది. వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లతో పాటు ఎజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్సేకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూపుల ద్వారా 2019లో ఫ్రాన్స్‌లో గూగుల్ పై ఫిర్యాదులు నమోదయ్యాయి.