ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి అదిరిపోయే ఆఫర్లు, ట్రావెల్ బెనిఫిట్స్
YouTube Premium free: ఫ్లిప్‌కార్ట్ కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black)తో అదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు, ట్రావెల్ బెనిఫిట్స్ అందిస్తోంది. అలాగే, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ తో అదరిపోయే ఆఫర్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దీని పేరు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black). ఈ సేవలో వినియోగదారులకు ఉచితంగా ఒక సంవత్సరం పాటు యూట్యూబ్ (YouTube) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. అలాగే, ప్రత్యేక డీల్స్, ట్రావెల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఇస్తోంది. అలాగే, వీఐపీ కస్టమర్ సపోర్ట్ వంటి అనేక ప్రయోజనాలు కూడా అందిస్తోంది.
KNOW
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ అందిస్తున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ యూజర్లకు ప్రధానంగా లభించే బెనిఫిట్స్ ఇవే
• ఉచిత యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) 1 సంవత్సరం పాటు యాడ్-ఫ్రీ వీడియోలు, యూట్యూబ్ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే వంటి సేవలు లభిస్తాయి.
• Flipkart Black Deals – గాడ్జెట్లు, ప్రీమియం అప్లయన్సులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయి.
• Cleartrip & Flipkart Travel – ట్రావెల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రూ. 1కు ఫ్లైట్ రీషెడ్యూల్ లేదా క్యాన్సలేషన్.
• SuperCoins Cashback – ప్రతి కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ (ఒక ఆర్డర్‌కు గరిష్టంగా రూ.100).
• Early Sale Access – ప్రధాన సేల్ ఈవెంట్స్‌కు ఒక రోజు ముందే యాక్సెస్ లభిస్తుంది.
• బ్యాంక్ ఆఫర్లు – 15% వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లు ఉంటాయి.
• Priority Customer Support – 24x7 ప్రత్యేక హెల్ప్‌డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సబ్‌స్క్రిప్షన్ ధర ఎంత?
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ ధర సంవత్సరానికి రూ. 1,499 గా ఉంది. అయితే, ప్రారంభ ఆఫర్‌లో ఈ నెల చివరి వరకు కేవలం రూ. 990కి దీనిని అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ అనేది ఇప్పటికే ఉన్న ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ వీఐపీని భర్తీ చేస్తుంది. గతంలో వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 799 కాగా, దానిలో యూట్యూబ్ ప్రీమియం వంటి ప్రత్యేక సేవలు లేవు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ vs ఫ్లిప్‌కార్ట్ ప్లస్.. తేడా ఏంటి?
• ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) – ఉచిత లాయల్టీ ప్రోగ్రామ్. సంవత్సరంలో కనీసం 4 కొనుగోళ్లు చేస్తే అందుబాటులోకి వస్తుంది. సూపర్ కాయిన్స్ క్యాష్‌బ్యాక్ వంటి ప్రాథమిక ప్రయోజనాలు ఉంటాయి.
• ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) – చెల్లింపు ఆధారిత సబ్‌స్క్రిప్షన్. షాపింగ్, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రీమియం బెనిఫిట్స్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ vs అమెజాన్ ప్రైమ్
- ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ – కేవలం వార్షిక ప్లాన్ ధర రూ. 1,499. ప్రారంభ ఆఫర్ లో రూ.990 అందుబాటులో ఉంది. ఇందులో ఉచిత యూట్యూబ్ ప్రీమియం, ప్రత్యేక డీల్స్, ట్రావెల్ ఆఫర్లు ఉన్నాయి.
- అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) – నెలవారీ, త్రైమాసిక, వార్షిక సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్ ఫ్రీ డెలివరీ, ప్రైమ్ రీడింగ్ వంటి సేవలు ఉన్నాయి. వార్షిక ప్లాన్ ధర రూ. 1,499. ఇటీవల ప్రైమ్ వీడియోలో యాడ్స్ ను తీసుకొచ్చారు. అవి రాకుండా అదనంగా రూ. 699 చెల్లించాలి.