MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Upcoming Mobiles: Vivo T4 Pro నుంచి Honor Magic 8 వరకు.. లాంచ్ కు సిద్ధంగా టాప్ 5 ఫోన్లు

Upcoming Mobiles: Vivo T4 Pro నుంచి Honor Magic 8 వరకు.. లాంచ్ కు సిద్ధంగా టాప్ 5 ఫోన్లు

Upcoming Mobiles: వివో, మోటరోలా, ఐటెల్, సామ్‌సంగ్, హానర్ కంపెనీలు ఈ వారంలో భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లతో రాబోతున్నాయి. వాటి స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 22 2025, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. వివో టీ4 ప్రో (Vivo T4 Pro)
Image Credit : @ZionsAnvin | X

1. వివో టీ4 ప్రో (Vivo T4 Pro)

వివో కంపెనీ తన కొత్త మిడ్‌రేంజ్ మోడల్ Vivo T4 Pro ను ఆగస్ట్ 26న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 3x పెరిస్కోప్ లెన్స్, 50MP ప్రధాన కెమెరాతో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా గోల్డ్, నైట్రో బ్లూ రంగుల్లో ఇది లభిస్తుంది.

200 గ్రాముల లోపు బరువుతో, స్లిమ్ బాడీ, క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఇది ప్రీమియం లుక్ లో వస్తోంది. ధర రూ.30,000లోపు ఉండే అవకాశం ఉంది. కెమెరా ఫీచర్లలో ముఖ్యమైంది 20x జూమ్ వరకు పని చేయడం. అలాగే, వీడియో రికార్డింగ్ 4K 30fps వరకు సపోర్ట్ చేస్తుంది.

25
2. మోటరోలా రెజర్ 60 (Motorola Razr 60 Swarovski Edition)
Image Credit : Motorola India Twitter

2. మోటరోలా రెజర్ 60 (Motorola Razr 60 Swarovski Edition)

మోటరోలా రెజర్ 60 Swarovski Edition, Moto Buds Loop ను సెప్టెంబర్ 1న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. Razr 60 మోడల్‌లో 3D లెదర్ ఫినిష్, 35 Swarovski క్రిస్టల్స్ ను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ.84,000గా ఉండవచ్చని అంచనా.

Buds Loop Ice Melt ఎడిషన్ కూడా విడుదలవుతుంది. ఈ బడ్స్‌లో Bose ట్యూనింగ్ సౌండ్, స్పేషియల్ ఆడియో, 36 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. Buds Loop ధర సుమారు రూ.27,000గా ఉండే అవకాశం ఉంది. రెండు మోడల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Related Articles

Related image1
మహిళల వరల్డ్ కప్ 2025: అందరిచూపు ఈ ఐదుగురు భారత ప్లేయర్ల పైనే
Related image2
జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే
35
3. ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)
Image Credit : our own

3. ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)

ఐటెల్ కంపెనీ Itel Zeno 20 మోడల్‌ను ఆగస్ట్ 25న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇది 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Unisoc T7100 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ 3GB/4GB RAM, 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 

13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ఈ మోడల్ లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్‌తో కూడిన Aivana 2.0 AI అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ధర రూ.5,999 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

45
4. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S25 FE)
Image Credit : @sondesix | X

4. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S25 FE)

సామ్‌సంగ్ గెలాక్సీ S25 FE భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. 6.7 అంగుళాల Dynamic AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.

Exynos 2400 ప్రాసెసర్, Android 16 ఆధారిత One UI 8 తో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 8MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉండనుంది.

55
5. హానర్ మ్యాజిక్ 8 సిరీస్ (Honor Magic 8 Series)
Image Credit : Gemini

5. హానర్ మ్యాజిక్ 8 సిరీస్ (Honor Magic 8 Series)

హానర్ మ్యాజిక్ 8 సిరీస్ భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌లో Magic 8, Magic 8 Pro, Magic 8 Mini, Magic 8 Max మోడల్స్ వస్తాయి. మొదట స్టాండర్డ్, ప్రో వెర్షన్లు మాత్రమే విడుదల అవుతాయని సమాచారం. Magic 8 Pro Snapdragon 8 Elite 2 చిప్‌సెట్‌తో రానుంది.

50MP OV50Q ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 200MP టెలిఫోటో లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇందులో ఉంటాయని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉండగా, Magic 8 Max మోడల్‌లో 6.9 అంగుళాల స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved