ఫేస్‌బుక్ ట్రిక్: లాక్ చేసిన లేదా ప్రైవేట్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎలా చూడాలో తెలుసుకోండి..
సాధారణంగా చాలా వరకు ఫేస్‌బుక్ (Facebook) ప్రొఫైల్‌లు లాక్ చేసి ఉంటాయి లేదా ప్రైవేట్‌గా ఉంటాయి. దీని వల్ల మనం నచ్చిన వారి లేదా కోరుకున్న వారి ప్రొఫైల్ పేజీని చూడలేకపోతుంటాం. నేటి డిజిటల్ యుగంలో గోప్యత(privacy)కి సంబంధించిన చాలా ప్రశ్నలు ప్రపంచం ముందుకు వచ్చాయి.
గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పై ఒక వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటో లేదా అతని ఏదైనా ఇతర ఫోటోలు డౌన్‌లోడ్ చేసి దుర్వినియోగం చేయడంపై చాలా కేసులు తెరపైకి వచ్చాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో ప్రొఫైల్ లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం వినియోగదారుల గోప్యత అలాగే వారి ముఖ్యమైన డేటాను రక్షించడం. మరోవైపు తరచుగా మనం మన స్నేహితులు లేదా పరిచయస్తుల ప్రొఫైల్ పేజీని తెరిచినప్పుడు లాక్ ఫీచర్ కారణంగా యాక్సెస్ చేయలేము. ఈ రోజు మనం ఫేస్‌బుక్‌లో లాక్ చేసిన లేదా ప్రైవేట్ ప్రొఫైల్‌ను చూడగలిగే మార్గం గురించి తెలుసుకుందాం..
మీరు ఒక వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ చేశాక కూడా చూడాలనుకుంటే ఇందుకు మీరు అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ (friend request)పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీరు అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేజీని చూడగలరు.
ఇంటర్నెట్‌లో ఇలాంటి థర్డ్ పార్టీ యాప్‌లు చాలా ఉన్నప్పటికీ వాటి ద్వారా మీరు ఒక వ్యక్తి లాక్ చేసిన ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటోను చూడవచ్చు, కానీ అలా చేయడం వల్ల మీ ప్రైవసికి భంగం కలగవచ్చు. మీరు వాటిని ఎప్పుడూ ఆశ్రయించకూడదు. ఈ థర్డ్ పార్టీ యాప్‌లు డబ్బు తీసుకోవడం లేదా సబ్ స్క్రిప్షన్ ద్వారా సంబంధిత వ్యక్తి లాక్ చేసిన ప్రొఫైల్‌ను చూపుతాయని క్లెయిమ్ చేస్తాయి, కానీ అవి వాస్తవానికి పని చేయవు.
ఈ థర్డ్ పార్టీ యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి లాగిన్ చేయడం మంచిది కాదు. ఇంకా మీ లాగిన్ ఐడి అండ్ పాస్‌వర్డ్ కూడా దుర్వినియోగం కావచ్చు.
ఒక వ్యక్తి లాక్ చేసిన ప్రొఫైల్‌ను చూడటానికి సులభమైన మార్గం వారి ఫ్రెండ్ లిస్ట్ లో ఉండటం. ఇందుకోసం కోసం సంబంధిత వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపవలసి ఉంటుంది. ఆ వ్యక్తి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ అక్సెప్ట్ చేసిన తర్వాత మీరు వారి లాక్ చేసిన ప్రొఫైల్‌ను సులభంగా వీక్షించవచ్చు.