Cut out Image: ట్రెండ్ ఫాలో అవ్వండి బాస్.. మీ ఫొటోలను కూడా ఇలా మార్చుకోండి.
Cut out Image: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రకరకాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల 3డీ ప్రింటింగ్ ఫొటోలు, కట్ అవుట్ ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. మరి మీ ఫొటోను కూడా కట్ అవుట్ ఫొటోలుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జెమినీ ఏఐతో..
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ జెమినీ ఏఐ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌లతో ఫొటోలను ఎడిటింగ్ చేసే బదులు ఒక చిన్న ప్రాంప్ట్‌తో ఫొటోలను నచ్చినట్లు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. నానో బనానో ట్రెండ్ పేరుతో ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మన ఫొటోను 3డీ ప్రింటింగ్ రూపంలోకి మార్చుకునేలా ఈ ప్రాంప్ట్‌ను రూపొందించారు. అయితే తాజాగా మరో ట్రెండ్ కూడా వైరల్ అవుతోంది.
కట్ అవుట్ ఇమేజ్..
తాజాగా సోషల్ మీడియాలో కట్ అవుట్ ఇమేజ్ పేరుతో కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మన ఫొటోలను పెద్ద పెద్ద విగ్రహాల రూపంలోకి మార్చడమే ఈ ఫీచర్ ఉద్దేశం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇలాంటి ఫొటోలు పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలను ఎలా డిజైన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం చేయాలంటే.?
ఇందుకోసం ముందుగా బ్రౌజర్‌లో జెమినీ ఏఐని ఓపెన్ చేయాలి. అనంతరం జెమినీ ఏఐ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కనిపించే + బటన్‌ను క్లిక్ చేయాలి. అప్‌లోడ్ ఫైల్స్ ఓపెన్ చేసి గ్యాలరీ నుంచి మీ ఫుల్ పిక్‌ను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఒక ప్రాంప్ట్‌ని ఇవ్వాలి.
ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి.
ఫొటోను సెలక్ట్ చేసుకున్న తర్వాత కింద పేర్కొన్న ప్రాంప్ట్‌ను ఇవ్వాలి. Create a giant hyper-realistic statue based on the given photo, keeping the original face exactly the same without changes. The statue stands tall in the middle of a roundabout in Dhaka, near a famous historical landmark. The statue is still under construction, surrounded by scaffolding, with many construction workers in yellow helmets and orange vests climbing, welding, and working on it. ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ నొక్కితే క్షణాల్లో మీ ఫొటో కట్ అవుట్ రూపంలో వస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన చోట షేర్ చేసుకోవచ్చు.