ఇండియాలోనే అతి సన్నని 5జి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: దీని అదిరిపోయే హైలెట్ ఫీచర్స్, ధర మీకోసం..
లెనోవా సబ్సిడరీ అమెరికన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ కంపెనీ మోటరోలా ఇండియా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌లను భారతదేశంలో విడుదల చేసింది.
మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ రెండు ఫోన్‌లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 20:9 అస్పెక్ట్ రేషియో ఓఎల్‌ఈడి డిస్‌ప్లే లభిస్తుంది. రెండు ఫోన్‌లకు వాటర్ అండ్ డస్ట్‌ప్రూఫ్ కోసం ఐపి52 రేటింగ్ పొందింది. వన్‌ప్లస్ నార్డ్ 2, వివో వి21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ52 వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ ధర
మోటరోలా ఎడ్జ్ 20 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .29,999. ఆగస్టు 24న ఫ్లిప్‌కార్ట్ అలాగే వివిధ రిటైల్ స్టోర్‌ల నుండి ఫ్రాస్ట్డ్ పెర్ల్, ఫ్రాస్ట్డ్ ఎమరాల్డ్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ధర రూ .21,499. 8జిబి ర్యామ్ 128జిబి స్టోరేజ్ ధర రూ.22,999. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ స్టోర్‌ల నుండి ఆగస్టు 27 నుండి సైబర్ టీల్, ఎలక్ట్రిక్ గ్రాఫైట్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు
మోటరోలా ఎడ్జ్ 20లో అండ్రాయిడ్ 11 ఆధారంగా మై యూఎక్స్, 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్‌ఈడి డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డిస్‌ప్లేపై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 20 కెమెరా
దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు, దీని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 16 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ సెన్సార్. సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 20 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టిఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, జిపిఎస్/ ఏ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ 4WmAh బ్యాటరీని 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ బరువు 163 గ్రాములు.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు
అండ్రాయిడ్ 11 ఆధారిత MyUX, 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్‌ఈడి మాక్స్ విజన్ డిస్‌ప్లే, 90HZ రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 800U 5G ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ కెమెరా
ఈ మోటరోలా ఫోన్‌లోని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టిఈ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి5, జిపిఎస్/ ఏ-జిపిఎస్, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఇచ్చారు. దీని బరువు 185 గ్రాములు.