ఇప్పుడు మీరు వాట్సప్ ద్వారా కూడా కరోనా వాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే ?
కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రభుత్వం పెద్ద సదుపాయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మీరు వాట్సప్ ద్వారా కరోనా టీకా స్లాట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా మీ సమీప టీకా కేంద్రం గురించి సమాచారాన్ని పొందవచ్చు. వాట్సప్ కొత్త ఫీచర్ MyGov కరోనా హెల్ప్‌డెస్క్‌తో పని చేస్తుంది.
కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం వాట్సప్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 32 లక్షల మండి కరోనా వాక్సిన్ సర్టిఫికేట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేయడం ఎలా?
మొదట మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్ లో మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ నంబర్ +91-9013151515 ని సేవ్ చేయాలీ.
ఇప్పుడు వాట్సప్ తెరిచి MyGov కరోనా హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ తెరవండి.
ఇప్పుడు బుక్ స్లాట్ అని టైప్ చేసి మెసేజ్ పంపండి.
దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఓటిపి వస్తుంది.
దీని తరువాత మీరు వాక్సిన్ లొకేషన్, తేదీ, పిన్ కోడ్, వాక్సిన్ టైప్ ఎంచుకునే ఆప్షన్ పొందుతారు.
దీని తరువాత మీ పిన్ కోడ్ ప్రకారం మీరు సమీప టీకా కేంద్రంలో టీకా కోసం వ్యాక్సిన్ స్లాట్ బుక్ అవుతుంది.
వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా
ముందుగా మీ మొబైల్‌లో +91-9013151515 నంబరును సేవ్ చేయండి.
ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయండి
తరువాత ఆ నంబర్‌కు 'కోవిడ్ సర్టిఫికెట్' లేదా 'డౌన్‌లోడ్ సర్టిఫికెట్' అని మెసేజ్ పంపండి.
ఇప్పుడు మీ నంబర్‌కు 6 అంకెల ఓటిపి వస్తుంది.
ఇప్పుడు చాట్‌లో ఓటిపి సెండ్ చేయండి
ఇప్పుడు కోవిన్ పోర్టల్‌లో నమోదైన సభ్యుల జాబితా మొబైల్ నంబర్ చూపిస్తుంది.
ఇప్పుడు మీరు ఎవరి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో సిరియల్ నంబరును సెండ్ చేయండి
మీరు మెసేజ్ పంపిన వెంటనే మీరు పిడిఎఫ్ ఫార్మాట్‌లో టీకా సర్టిఫికేట్ పొందుతారు.
వాట్సాప్ కాకుండా మీరు కోవిన్ పోర్టల్ నుండి కూడా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కరోనా అప్‌డేట్‌ల కోసం ఇంకా కరోనాకు సంబంధించిన వ్యక్తుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం గత సంవత్సరం నుండి ఈ వాట్సాప్ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది.