శామ్‌సంగ్, మోటోరోలకి పోటీగా మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఈ పేరుతో మార్కెట్లోకి..
కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ మొట్టమొదట ఫోల్డబుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ గురించి సూచించింది. ఇప్పుడు మళ్లీ గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై ఒక కొత్త సమాచారం బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ పేరుతో రావచ్చు, దీనిని 2021 చివరి నాటికి లాంచ్ చేయవచ్చు. గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్‌కు పోటీని ఇవ్వగలదు. అయితే, ఫోల్డబుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ విడుదలపై కంపెనీ అధికారిక సమాచారం వెల్లడించలేదు.
2021 చివరిలో
డిస్‌ప్లే సప్లై చెయిన్ కన్సల్టెంట్స్ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ నరంజో చేసిన ట్వీట్ లో 2021 చివరిలో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ రావచ్చునని ఊహించారు. డేవిడ్ నరంజో ఇటీవల ఒక ట్వీట్ ద్వారా ఈ డివైజ్ లిస్ట్ చెర్ చేశాడు. ఈ జాబితాలో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ గురించి ప్రస్తావించారు, దీనిని 2021 చివరిలో ప్రారంభించవచ్చు అని తెలిపారు.
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఎల్‌టిపిఓ ఓలేడ్ డిస్‌ప్లేతో రావచ్చు అని నరంజో ట్వీట్ ద్వార సూచించారు.
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ లాంచ్ టైమ్‌లైన్‌లో అప్‌డేట్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం గూగుల్ మూడు డివైజెస్ సృష్టించడం పై సూచించింది. కోడ్‌నేమ్స్ 'రావెన్,' 'ఓరియోల్,' అండ్ 'పాస్‌పోర్ట్. ఈ మూడింటిలో చివరిది పిక్సెల్ సూచనగా పరిగణించబడుతుంది.