రిలయన్స్ జియో చౌకైనా 4జి స్మార్ట్ ఫోన్ పై మరో బిగ్ న్యూస్.. మరి కొద్దిరోజుల్లోనే..
ఆసియా అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రపంచంలోని చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను ఈ ఏడాది జూన్‌లో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టింది, అయితే ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి సమాచారం అధికారికంగా వెల్లడించలేదు.
రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్స్ట్ తయారు చేశారు. జియోఫోన్ నెక్స్ట్ సేల్ సెప్టెంబర్ 10 నుండి భారతీయ మార్కెట్లో ప్రారంభం కానుంది. అయితే గతం నుంచే ఈ ఫోన్ ఫీచర్ల గురించి లీకైన నివేదికలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఈ ఫోన్ కొన్ని ఫీచర్లు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు జియోఫోన్ నెక్స్ట్ ధరకి సంబంధించి లీకైన నివేదిక ఒకటి బయటపడింది.
జియోఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్ల గురించి
టిప్‌స్టర్ యోగేష్ ప్రకారం ధర గురించి మాట్లాడితే జియోఫోన్ నెక్స్ట్ ధర రూ. 3,499 ఉండనుంది. దీని సేల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ జియోఫోన్ నెక్స్ట్‌లో అందించారు. అంతేకాకుండా ఫోన్ కి 5.5-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్కమ్ QM215 ప్రాసెసర్, 2 లేదా 3 జిబి ర్యామ్, 16 లేదా 32జిబి స్టోరేజ్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 308 జిపియూ లభిస్తుంది.
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా జియోఫోన్ నెక్స్ట్‌లో చూడవచ్చు. అలాగే ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో 4జి వివో ఎల్‌టిఈతో 2500mAhబ్యాటరీని ఇచ్చారు. ఫోన్ ఎక్స్5 ఎల్‌టిఈ మోడెమ్, బ్లూటూత్ వి4.2కి సపోర్ట్ చేస్తుంది, కనెక్టివిటీ కోసం జిపిఎస్ అందుబాటులో ఉంటుంది.
జియో ఫోన్ నెక్స్ట్ కెమెరాతో గూగుల్ లెన్స్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నో రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. పోర్ట్రెయిట్ మోడ్ కూడా కెమెరాతో వస్తుంది. స్నాప్ చాట్ ఫిల్టర్లు కూడా కెమెరాతో అందుబాటులో ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ గూగుల్ అసిస్టెంట్ మీ కమాండ్ మేరకు మ్యూజిక్ ప్లే చేస్తుంది ఇంకా మైజియో యాప్‌ను కూడా ఓపెన్ చేస్తుంది.
జియో ఫోన్ నెక్స్ట్ అన్ని రకాల సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. ఫోన్‌లోని ఫిజికల్ బటన్లు పవర్ అండ్ వాల్యూమ్ కోసం మాత్రమే ఉంటాయి. నావిగేషన్ అండ్ హోమ్ కోసం టచ్ సపోర్ట్ ఇచ్చారు. కంపెనీ లోగో ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై ఉంటుంది. ఫ్రంట్ కెమెరాతో ఫ్లాష్ లైట్ కూడా ఉంది. బ్యాక్ ప్యానెల్‌లో సింగిల్ కెమెరా అండ్ క్వాడ్ ఫ్లాష్ లైట్ ఉంటుంది.