MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Best Selling iPhone Model: ఐఫోన్లలో బాహుబలి మోడల్.. ఆపిల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఏదో తెలుసా?

Best Selling iPhone Model: ఐఫోన్లలో బాహుబలి మోడల్.. ఆపిల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఏదో తెలుసా?

Best Selling iPhone Model: ఆపిల్ ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్, ఒక స్టేటస్ సింబల్. గత 19 ఏళ్లలో ఆపిల్ కంపెనీ డజన్ల కొద్దీ ఐఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ, ఆపిల్ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఏదో తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్.. 22 కోట్లకు పైగా అమ్ముడైన ఆ ఐఫోన్ మోడల్
Image Credit : Gemini

ఆపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్.. 22 కోట్లకు పైగా అమ్ముడైన ఆ ఐఫోన్ మోడల్

ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజే వేరు. ప్రతి ఏటా కొత్త ఫీచర్లతో వస్తున్న ఐఫోన్ల కోసం జనాలు క్యూ కడుతుంటారు. కానీ, ఆపిల్ చరిత్రలోనే ఒక జనరేషన్ ఐఫోన్ మాత్రం కమర్షియల్‌గా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒమ్డియా, సీఐఆర్‌పీ వంటి ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనాల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 6 (iPhone 6), ఐఫోన్ 6 ప్లస్ (iPhone 6 Plus) మోడళ్లు ఇప్పటివరకు ఆపిల్ హిస్టరీలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయి.

ఈ రెండు మోడళ్లు కలిసి లైఫ్‌టైమ్‌లో ఏకంగా 220 మిలియన్లకు పైగా (22 కోట్లకు పైగా) యూనిట్లు అమ్ముడై ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేశాయి. ఆపిల్ అధికారికంగా మోడళ్ల వారీగా సేల్స్ నంబర్లను ఎప్పుడూ ప్రకటించదు. కానీ, మార్కెట్ అనలిస్టులు మాత్రం ఐఫోన్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనే ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ అని పేర్కొంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెద్ద డిస్‌ప్లేతో వచ్చిన బిగ్గెస్ట్ ఛేంజ్
Image Credit : our own

పెద్ద డిస్‌ప్లేతో వచ్చిన బిగ్గెస్ట్ ఛేంజ్

ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ 2014లో ఐఫోన్ 6 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇది ఐఫోన్ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు వరకు ఆపిల్ చిన్న స్క్రీన్ ఉన్న ఫోన్లనే ఇచ్చేది. కానీ మొదటిసారిగా ఐఫోన్ 6 లో 4.7-అంగుళాలు, ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5-అంగుళాల పెద్ద స్క్రీన్లను పరిచయం చేసింది.

ఆ టైమ్‌లోనే ఆండ్రాయిడ్ ఫోన్లు పెద్ద స్క్రీన్లతో మార్కెట్‌ను ఊపేస్తుండటంతో, ఐఫోన్ యూజర్లు కూడా పెద్ద డిస్‌ప్లే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ టైమ్‌లో ఐఫోన్ 6 మార్కెట్లోకి రావడంతో, పాత ఐఫోన్ వాడుతున్న లక్షలాది మంది యూజర్లు ఒకేసారి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. ఆపిల్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్ సైకిల్‌ను క్రియేట్ చేసింది.

36
నెక్ట్స్ లెవెల్ ఫీచర్లతో యూజర్లకు ఫుల్ ఫీస్ట్
Image Credit : our own

నెక్ట్స్ లెవెల్ ఫీచర్లతో యూజర్లకు ఫుల్ ఫీస్ట్

ఐఫోన్ 6 సిరీస్ కేవలం స్క్రీన్ సైజ్ వల్లే కాకుండా లుక్ అండ్ ఫీచర్ల పరంగా కూడా సూపర్ హిట్ అయింది. ఈ ఫోన్లలో సరికొత్త, స్లిమ్ అల్యూమినియం డిజైన్, అప్‌గ్రేడెడ్ కెమెరాలు, పవర్‌ఫుల్ ఏ8 ప్రాసెసర్, ఆపిల్ పే సపోర్ట్, ఫాస్టర్ ఎల్‌టీఈ కనెక్టివిటీ వంటి క్రేజీ ఫీచర్లను ఆపిల్ అందించింది. ఈ అప్‌డేట్స్ అప్పటికే ఐఫోన్ వాడుతున్న వారినే కాకుండా, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనే కొత్త యూజర్లను కూడా విపరీతంగా అట్రాక్ట్ చేశాయి.

46
యాపిల్‌ను ప్రపంచ టాప్ కంపెనీగా మార్చిన లాంచ్
Image Credit : our own

యాపిల్‌ను ప్రపంచ టాప్ కంపెనీగా మార్చిన లాంచ్

ఐఫోన్ 6 సక్సెస్ కేవలం సేల్స్ నంబర్లకే పరిమితం కాలేదు. ఈ సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ కంపెనీ క్వార్టర్లీ రెవెన్యూ, ప్రాఫిట్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా చైనా వంటి పెద్ద మార్కెట్లలో ఆపిల్ పొజిషన్ మరింత స్ట్రాంగ్ అయింది. అక్కడ పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లకు ఉన్న భారీ డిమాండ్‌ను ఐఫోన్ 6 పూర్తిగా క్యాష్ చేసుకుంది. ఈ ఐఫోన్ 6 సిరీస్ ద్వారా యాపిల్‌కు పదుల బిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చిందని, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఆపిల్ నిలదొక్కుకోవడానికి ఈ మోడలే పునాది వేసిందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.

56
ఐఫోన్ 6 తర్వాత రికార్డ్ సేల్స్ సాధించిన మోడళ్లు ఇవే
Image Credit : ‍X

ఐఫోన్ 6 తర్వాత రికార్డ్ సేల్స్ సాధించిన మోడళ్లు ఇవే

ఐఫోన్ 6 తర్వాత కూడా ఆపిల్ నుండి వచ్చిన కొన్ని మోడళ్లు అదిరిపోయే సేల్స్ నమోదు చేశాయి. వాటిలో ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 7 సిరీస్, ఐఫోన్ 12 మోడళ్లు బెస్ట్ సెల్లింగ్ డివైజ్‌లుగా నిలిచాయి. బెటర్ కెమెరాలు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, 5జీ టెక్నాలజీ రావడంతో ఈ ఫోన్లు బాగా అమ్ముడయ్యాయి. అయినప్పటికీ, ఐఫోన్ 6 క్రియేట్ చేసిన 22 కోట్ల యూనిట్ల లైఫ్‌టైమ్ సేల్స్ రికార్డును మాత్రం ఏ ఒక్క మోడల్ కూడా దాటలేకపోయింది.

66
ఆ రికార్డును ఆపిల్ ఇప్పటికీ ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది?
Image Credit : Getty

ఆ రికార్డును ఆపిల్ ఇప్పటికీ ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది?

ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఆపిల్ ఫోన్ల లైనప్ చాలా మారిపోయింది. అప్పట్లో కేవలం ఒకటి లేదా రెండు మోడళ్లు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆపిల్ ఒకేసారి స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ అంటూ మల్టిపుల్ వేరియంట్లను మార్కెట్లోకి తెస్తోంది. దీనివల్ల కస్టమర్ల డిమాండ్ అనేది వేర్వేరు డివైజ్‌ల మధ్య డివైడ్ అయిపోతోంది. అందుకే ఇప్పుడున్న రోజుల్లో ఒకే ఒక్క ఐఫోన్ మోడల్ ఐఫోన్ 6 లాంటి అసాధారణమైన సేల్స్ నంబర్లను అందుకోవడం కష్టంగా మారింది. 

అయితే, ఇప్పుడు వస్తున్న ఐఫోన్ల ప్రీమియం ధరల వల్ల యూనిట్ల పరంగా తక్కువ అమ్ముడైనా, ఆపిల్ కంపెనీకి మాత్రం మునుపటి కంటే భారీగా ఆదాయం వస్తోంది. యూనిట్ల సేల్స్ రికార్డ్ ఐఫోన్ 6 దే అయినా, ఎక్కువ మనీ జనరేట్ చేయడంలో మాత్రం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్లదే పైచేయిగా ఉంటోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image2
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image3
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Related Stories
Recommended image1
Digital India Super Apps: మీ మొబైల్‌లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్‌ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ !
Recommended image2
Tata EV Discounts: టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved