MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • Baby AI Video : సోషల్ మీడియాలో బేబీ AI వీడియో ట్రెండ్.. మీరు కూడా ట్రై చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Baby AI Video : సోషల్ మీడియాలో బేబీ AI వీడియో ట్రెండ్.. మీరు కూడా ట్రై చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

సోషల్ మీడియాలో 'బేబీ AI వీడియో' ట్రెండ్ దుమ్మురేపుతోంది. Kling AI, Higgsfield AI టూల్స్‌తో నిమిషాల్లోనే క్యూట్, సినిమాటిక్ బేబీ వీడియోలను ఎలా తయారు చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Arun Kumar P
Published : Feb 12 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోషల్ మీడియాలో బేబీ AI వీడియోల ట్రెండ్
Image Credit : gemini ai

సోషల్ మీడియాలో బేబీ AI వీడియోల ట్రెండ్

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. అదే బేబీ AI వీడియో. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌లో ఇలాంటి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోల్లో ఓ క్యూట్ బేబీని ప్రొఫెషనల్ కెమెరా మూమెంట్స్, సినిమాటిక్ యాంగిల్స్‌తో చాలా స్మూత్‌గా చూపిస్తారు. చూడగానే ఇది ఏదో ఖరీదైన స్టూడియోలో తీశారనిపిస్తుంది. కానీ అసలు నిజం వేరే ఉంది.

Kling AI, Higgsfield AI వీడియో జనరేటర్ లాంటి అడ్వాన్స్‌డ్ AI టూల్స్.. ఇలాంటి వీడియోలను చాలా సులభంగా తయారు చేస్తున్నాయి. అసలు ఈ బేబీ AI వీడియో ఏంటి? ఎందుకింత వైరల్ అవుతోంది? మీరే సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు బేబీ AI వీడియో అంటే ఏంటి?
Image Credit : Instagram

అసలు బేబీ AI వీడియో అంటే ఏంటి?

బేబీ AI వీడియో అంటే.. ఒక పసిపిల్లల ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కదిలే వీడియోగా మార్చడం. ఈ ఫోటో నిజమైనది కావచ్చు లేదా AI తో సృష్టించింది కావచ్చు. దీనికి కెమెరా ప్యాన్, స్లో జూమ్, ట్రాకింగ్, సినిమాటిక్ లైటింగ్ వంటి ఎఫెక్ట్స్ జోడిస్తారు. పసిపిల్లల ముఖ కవళికలు కూడా చాలా సహజంగా కనిపించడంతో, వీడియో అచ్చం నిజమైన షూట్‌లా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా అల్గారిథమ్‌కు త్వరగా నచ్చుతాయి.

Related Articles

Related image1
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
35
ఈ వీడియోలు ఎందుకంత వైరల్ అవుతున్నాయి?
Image Credit : gemini ai

ఈ వీడియోలు ఎందుకంత వైరల్ అవుతున్నాయి?

బేబీ AI వీడియోలు వైరల్ అవడానికి ప్రధాన కారణం ఎమోషనల్ కనెక్షన్. పసిపిల్లలకు సంబంధించిన కంటెంట్ జనాలను వెంటనే ఆకర్షిస్తుంది. వాళ్ల క్యూట్ స్మైల్, అమాయకమైన హావభావాలు చూసేవాళ్లను వీడియో స్క్రోల్ చేయకుండా ఆపేస్తాయి.

రెండో కారణం AI మోషన్ కంట్రోల్. Kling AI, Higgsfield లాంటి టూల్స్.. సాధారణంగా మొబైల్ ఫోన్‌తో తీసే వీడియోల్లో సాధ్యం కాని కెమెరా మూమెంట్స్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక 30 నుంచి 60 సెకన్ల నిడివి ఉండే ఈ వీడియోలు రీల్స్, షార్ట్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. అందుకే ప్లాట్‌ఫామ్స్ కూడా వీటిని ఎక్కువగా పుష్ చేస్తున్నాయి.

45
బేబీ AI వైరల్ వీడియో ఎలా తయారు చేయాలి?
Image Credit : Instagram

బేబీ AI వైరల్ వీడియో ఎలా తయారు చేయాలి?

ఈ వీడియో చేయడానికి పెద్దగా టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. ఒక హై-క్వాలిటీ బేబీ ఇమేజ్, Kling AI అకౌంట్, Higgsfield AI వీడియో జనరేటర్, ఒక మంచి ప్రాంప్ట్ ఉంటే చాలు.

స్టెప్ 1: బేబీ ఇమేజ్ రెడీ చేసుకోండి

ముందుగా మీకు స్పష్టమైన, హై-క్వాలిటీ బేబీ ఫోటో కావాలి. మీ దగ్గర నిజమైన బేబీ ఫోటో ఉంటే, అది ఫ్రంట్ ఫేస్‌తో, మంచి లైటింగ్‌లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు AI ఇమేజ్ వాడాలనుకుంటే, Higgsfield లేదా మరో AI ఇమేజ్ జనరేటర్‌లో ఈ ప్రాంప్ట్ ట్రై చేయొచ్చు. “Ultra realistic cute baby, soft lighting, cinematic look, shallow depth of field, 4K quality”

స్టెప్ 2: Kling AI తో మోషన్ కంట్రోల్ వీడియో చేయండి

ఇప్పుడు ఈ ఇమేజ్‌ను వీడియోగా మార్చడానికి Kling AI వాడాలి. Kling AI వెబ్‌సైట్‌కి వెళ్లి 'Image to Video' ఆప్షన్ ఎంచుకోండి. మీ బేబీ ఇమేజ్ అప్‌లోడ్ చేసి, ఒక మోషన్ ప్రాంప్ట్ రాయండి.

ఉదాహరణకు: “Slow cinematic camera movement, soft zoom in, natural baby facial expressions, realistic motion”

వీడియో నిడివి 5 నుంచి 10 సెకన్లు పెట్టి, 'Generate' పై క్లిక్ చేయండి. కొద్ది క్షణాల్లోనే మీ బేబీ AI వీడియో రెడీ అవుతుంది.

స్టెప్ 3: Higgsfield AI తో వీడియోను మెరుగుపరచండి

ఇప్పుడు ఈ వీడియోకు మరింత ప్రొఫెషనల్ టచ్ ఇవ్వడానికి Higgsfield AI వీడియో జనరేటర్ వాడండి. ఈ టూల్ వీడియోను స్మూత్ చేస్తుంది, ఫేస్ డిటైల్స్‌ను మెరుగుపరుస్తుంది, లైటింగ్‌లో సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ వీడియో ఫైనల్ రెండర్ తీసుకోవచ్చు.

55
బేబీ AI వైరల్ వీడియోతో డబ్బు సంపాదించడం ఎలా?
Image Credit : Instagram

బేబీ AI వైరల్ వీడియోతో డబ్బు సంపాదించడం ఎలా?

మీరు ఈ ట్రెండ్‌ను సరిగ్గా ఫాలో అయితే డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా బ్రాండ్ డీల్స్ పొందవచ్చు. అలాగే క్లయింట్ల కోసం AI బేబీ వీడియోలు చేసి ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు. చాలామంది క్రియేటర్లు ఇలాంటి వీడియోలతో తమ పేజ్‌ను గ్రో చేసుకుని, ఆ తర్వాత మానిటైజ్ చేస్తున్నారు.

ఒకవేళ మీరు నిజమైన బేబీ ఫోటో వాడుతుంటే, తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం. అనుమతి లేకుండా ఎవరి ఫోటోనైనా కమర్షియల్‌గా వాడితే చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఈ విషయంలో AI జనరేటెడ్ ఇమేజ్‌లు చాలా సురక్షితమైనవి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
కృత్రిమ మేధస్సు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved