- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ 2025: శ్రేయస్, జైస్వాల్ టీమిండియాలో ఎందుకు లేరు? మాజీ సెలక్టర్ హాట్ కామెంట్స్
ఆసియా కప్ 2025: శ్రేయస్, జైస్వాల్ టీమిండియాలో ఎందుకు లేరు? మాజీ సెలక్టర్ హాట్ కామెంట్స్
Asia Cup 2025 Team India: ఆసియా కప్ 2025 భారత జట్టు ఎంపికలో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ లేకపోవడంపై మాజీ సెలక్టర్ సలీల్ అంకోలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరు ప్లేయర్లను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలను లేవనెత్తారు.

ఆసియా కప్ 2025కు సిద్ధమైన టీమిండియా
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.
ఈ జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు కొంతమంది యువ ఆటగాళ్లు కూడా స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ తప్పకుండా జట్టులో ఉంటారని అందరూ భావించారు కానీ, అది జరగలేదు.
KNOW
ఆసియా కప్ 2025 భారత జట్టు పై మాజీ సెలక్టర్ అంకోలా కామెంట్స్
ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టు పై మాజీ సెలక్టర్ సలీల్ అంకోలా స్పందించారు. అయ్యర్, జైస్వాల్ లను జట్టులోకి తీసుకోకపోవం పై ప్రశ్నలు లేవనెత్తారు.
"శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కొత్తగా వచ్చిన కొంతమంది ఆటగాళ్లు ఈజీగానే చోటుదక్కించుకున్నారు. కానీ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్‌కు కనీసం రిజర్వ్ బెంచ్‌లోనూ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం" అని ఆయన అన్నారు.
అయ్యర్, జైస్వాల్ లను జట్టులోకి తీసుకోకపోవడం పై అజిత్ అగార్కర్ ఏమన్నారు?
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికకు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడుతూ జట్టు లోకి జైస్వాల్, అయ్యర్ లను తీసుకోకపోవడం గురించి ప్రస్తావించారు.
"శ్రేయస్‌ను పక్కన పెట్టడం అతని తప్పు కాదు.. మాది కూడా కాదు. జట్టులో 15 మందికే అవకాశం ఇవ్వగలము. జైస్వాల్ బదులుగా అభిషేక్ శర్మను ఎంపిక చేయడానికి కారణం ఆయన ఆల్‌రౌండ్ నైపుణ్యం.. కాబట్టి వారి సమయం కోసం వేచివుండాలి" అని ఆయన వివరించారు.
సూపర్ ఫామ్ లో శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ ఐపీఎల్ 2025లో మరో సారి తన బ్యాటింగ్, కెప్టెన్సీ ప్రతిభను చూపించాడు. మొత్తం 17 మ్యాచ్ లలో 604 పరుగులు చేశాడు. 50.33 యావరేజ్, 175.07 స్ట్రైక్‌రేట్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో 6 హాఫ్ సెంచీరలు కూడా ఉన్నాయి.
గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన అయ్యర్.. 2025 లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దేశవాళీ క్రికెట్ లో ముంబయి జట్టుకు విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు అందించాడు. టీమిండియా తరఫున 51 టీ20 మ్యాచ్‌ల్లో 1104 పరుగులు సాధించాడు. ఇందులో 8 హాప్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ లో 3731 పరుగులు సాధించాడు. 27 హాఫ్ సెంచరీలు బాదాడు.
ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే యశస్వి జైస్వాల్
భారత జట్టు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ తో పాటు ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టూర్ లో అద్భుతంగా రాణించాడు. 2025 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 14 మ్యాచ్‌ల్లో 559 పరుగులు చేశాడు. 43.00 సగటు, 159.71 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ ను కొనసాగించాడు.
అలాగే, భారత జట్టు తరఫున ఇప్పటిరకు టీ20 క్రికెట్ లో 23 మ్యాచ్‌లలో 164.32 స్ట్రైక్ రేట్‌తో 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే
భారత ప్రధాన జట్టు (15 మంది)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు (5 మంది)
ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.