Apple vs Samsung: ఐఫోన్ 17 సిరీస్‌పై సామ్‌సంగ్ ట్రోలింగ్.. అంత మాట అన్నారేంటి.?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయగా త్వరలోనే అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ చేసిన ఓ పోస్ట్ కొత్త చర్చకు దారి తీసింది.

ఐఫోన్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్
యాపిల్ పార్క్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో కంపెనీ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది. వీటితో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో 3, స్మార్ట్‌వాచ్ సిరీస్ 11, ఎస్‌ఈ3 వాచ్ వంటి కొత్త డివైస్‌లను కూడా ప్రకటించింది. ఈ లాంచ్ గ్లోబల్ టెక్ అభిమానుల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తించింది.
సామ్‌సంగ్ పరోక్ష సెటైర్లు
యాపిల్ ప్రతి సారి కొత్త ఉత్పత్తులు విడుదల చేసినప్పుడు, దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ సంస్థ పరోక్షంగా స్పందించడం అలవాటే. ఈసారి కూడా అదే జరిగింది. యాపిల్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వ్యంగ్య పోస్టులు పెట్టింది.
ఫోల్డబుల్ ఫోన్ అంశంపై: 2022లో "ఇంకా రాలేదు" అని చెప్పిన పాత పోస్ట్‌ను మళ్లీ షేర్ చేస్తూ యాపిల్‌పై సెటైర్ వేసింది.
కెమెరా సామర్థ్యం గురించి: "48MP × 3 కూడా 200MPకి దగ్గర కాలేదు" అంటూ పోలిక చేసింది.
కొత్త ఫీచర్లపై వ్యాఖ్యలు: ఐఫోన్ 17లో తీసుకొచ్చిన స్లీప్ స్కోర్, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లను టార్గెట్ చేస్తూ, "స్లీప్ స్కోర్ కోసం ఎవరో ఐదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని నమ్మలేకపోతున్నాం" అని పరోక్షంగా ఎగతాళి చేసింది.
#iCant believe this is still relevant. 💀 https://t.co/s6SFaLTRSJ
— Samsung Mobile US (@SamsungMobileUS) September 9, 2025
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
శాంసంగ్ ఈ పోస్టులను #iCant హ్యాష్‌ట్యాగ్‌తో వరుసగా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు సామ్‌సంగ్ అభిమానులు ఈ వ్యంగ్యాన్ని ఆస్వాదిస్తూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం "ముందు మీ ఫోన్లలో ఉన్న సమస్యలు పరిష్కరించండి" అంటూ విమర్శలు చేశారు. దీంతో యాపిల్–శాంసంగ్ మధ్య పరోక్ష పోటీ మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
#iCant believe some people had to wait 5 years for Sleep Score 🫣
— Samsung Mobile US (@SamsungMobileUS) September 9, 2025
ఐఫోన్ 17 ఎయిర్ హైలెట్స్
ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ iPhone 17 Air. ఇది యాపిల్ ఇప్పటివరకు తయారు చేసిన అతి సన్నగా ఉన్న iPhone – కేవలం 5.6 మిల్లీమీటర్లు. ధర $999 (భారత కరెన్సీలో రూ.1,19,900 నుంచి). ఇది A19 Pro ప్రాసెసర్, N1 నెట్‌వర్కింగ్ చిప్, C1X మోడమ్‌తో వస్తోంది. రంగులు: స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ. ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా eSIM మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
మిగతా iPhone 17 మోడల్స్
iPhone 17 – రూ.82,900 నుంచి. 6.3 అంగుళాల డిస్‌ప్లే, 120Hz ప్రొమోషన్, 24MP ఫ్రంట్ కెమెరా, లావెండర్, మిస్ట్ బ్లూ కలర్స్.
iPhone 17 Pro – రూ.1,34,900 నుంచి. అల్యూమినియం డిజైన్, హారిజాంటల్ కెమెరా బార్, A19 Pro చిప్.
iPhone 17 Pro Max – రూ.1,49,900 నుంచి. 8K వీడియో రికార్డింగ్, పెద్ద బ్యాటరీ.