Android 16 టెక్ ప్రపంచం షేక్ అయ్యేలా ఆండ్రాయిడ్ 16: గూగుల్ అప్డేట్!
గూగుల్ తన కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్లో ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే అప్డేట్స్ ఇస్తామంటోంది. సాధారణంగా ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లను ఆగస్టులో రిలీజ్ చేస్తుంది. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి భిన్నంగా జూన్‌లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. అందులో ఉండే ప్రత్యేకతల విషయానికొస్తే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆండ్రాయిడ్ 16
మొబైల్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025) బార్సిలోనాలో జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ 16 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆండ్రాయిడ్ 16 జూన్‌లో రిలీజ్ చేస్తామని గూగుల్ అఫీషియల్‌గా ప్రకటించింది.
గూగుల్ సాధారణంగా ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లను ఆగస్టులో రిలీజ్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం జూన్‌లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది. దీనికి కారణం గూగుల్ కొత్త "ట్రంక్ స్టేబుల్" డెవలప్‌మెంట్ పద్ధతిని ఫాలో అవ్వడమే.
ట్రంక్ స్టేబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి?
ఈ డెవలప్‌మెంట్ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ డిజైనర్లు సాఫ్ట్‌వేర్ కోడ్‌లో చిన్న మార్పులను ఒకే షేర్డ్ బ్రాంచ్‌లో డైరెక్ట్‌గా చేస్తారు. ఇది డెవలప్‌మెంట్ ప్రాసెస్ టైమ్‌లో కంప్లీట్ చేయడం, ఇంటిగ్రేషన్ స్టేజ్‌లను ఈజీ చేస్తుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ రిలీజ్ స్పీడ్ పెరుగుతుంది.
గూగుల్ ఆండ్రాయిడ్ ఎన్విరాన్‌మెంట్ హెడ్ సమీర్ సమాత్, "ట్రంక్ స్టేబుల్ డెవలప్‌మెంట్ అంటే ఆండ్రాయిడ్‌లో పనిచేసేవాళ్లంతా కోడ్ ఒకే బ్రాంచ్‌లో ఇవ్వడం" అని చెప్పారు.
జూన్ 3న రిలీజ్!
ఆండ్రాయిడ్ 16 జూన్ 3న ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP)కి మారుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత డెవలపర్లు వాళ్ల డివైజ్‌లకు తగ్గట్టుగా ఓఎస్ కస్టమ్ వెర్షన్స్ క్రియేట్ చేసి రిలీజ్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్ 16 బీటా 2.1ని రీసెంట్‌గా పిక్సెల్ డివైజ్‌లకు రిలీజ్ చేశారు. ఈ వెర్షన్‌లో కొత్త ఫీచర్లు ఏమీ లేకపోయినా కనెక్షన్, సిస్టమ్ స్టెబిలిటీ, పర్ఫార్మెన్స్ లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్‌ను ఫిక్స్ చేశారు.
ఆండ్రాయిడ్ 16 ఫస్ట్ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, మిగతా గూగుల్ మొబైల్స్‌లో వస్తుంది. తర్వాత మిగతా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా వాళ్ల డివైజ్‌లకు ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్ రిలీజ్ చేస్తాయి.
ఆండ్రాయిడ్ 16లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
ఆండ్రాయిడ్ 16లో చాలా కొత్త ఫీచర్లు, ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లు, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటాయని టాక్.
గూగుల్ ఈ అనౌన్స్‌మెంట్ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్ 16 మొబైల్ వరల్డ్‌లో కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. జూన్ దాకా వెయిట్ చేద్దాం!