అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యూజర్లకు షాకింగ్.. త్వరలోనే వాటి ధర పెంపు..
మీరు కూడా అమెజాన్ ప్రైమ్(amazon prime) మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారా ఆయితే ఆలస్యం చేయకండి. ఎందుకంటే త్వరలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర 50 శాతం ఖరీదు కానుంది, ఇప్పుడు వార్షిక మెంబర్‌షిప్ ధర ప్రస్తుతం రూ. 999 నుండి రూ .1,499 మారనుంది.
మరోవైపు ప్రతినెల, త్రైమాసిక ప్లాన్ల ధర పై కూడా ప్రభావం చూపవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్(prime membership) ఉన్న కస్టమర్‌లు ప్రత్యేక ఆఫర్‌లను పొందువచ్చు ఇంకా అమెజాన్ సేల్ సమయంలో ఇతర కస్టమర్ల కంటే ముందుగా షాపింగ్ (shopping)చేసే అవకాశాన్ని పొందుతారు. ఇది కాకుండా అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ కూడా అందుబాటులో ఉంటాయి.
కొత్త అప్‌డేట్ తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పై ఖర్చు ఎంత అవుతుందంటే ప్రస్తుత రూ. 999 ప్యాక్ ధర రూ .1,499 చేరుతుంది. దీని వాలిడిటీ 12 నెలలు. అలాగే రూ .329 త్రైమాసిక ప్లాన్ ధర రూ .459కి, ప్రతినెల ప్లాన్ రూ .129 రూ .179 పెరగనుంది. అమెజాన్ ఈ పెంపు తేదీని సెట్ చేయనప్పటికీ కొత్త ధర త్వరలో వర్తించనుంది. అమెజాన్ ప్రైమ్ ఐదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టరు.
18-24 ఏళ్ల యువ కస్టమర్‌ల కోసం
అమెజాన్ ప్రైమ్ కూడా మే 2021 నుండి ప్రైమ్ యూత్(prime youth) ఆఫర్‌లో భాగంగా 18-24 ఏళ్లలోపు ఉన్న కస్టమర్‌ల కోసం ధరలను మార్చింది, అయితే కొత్త అప్‌డేట్‌తో యువ కస్టమర్‌లు కూడా లాభం పొందవచ్చు. యువ వినియోగదారులకు ప్రతినెల ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రూ .రూ .64, త్రైమాసిక ప్రైమ్ మెంబర్‌షిప్ రూ .165కి, వార్షిక ప్లాన్ ధర రూ .499కి తగ్గించింది.