MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఎయిర్‌టెల్ vs జియో.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ తెలుసా ? పూర్తి వివరాలు ఇవే!!

ఎయిర్‌టెల్ vs జియో.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ తెలుసా ? పూర్తి వివరాలు ఇవే!!

మన దేశంలో ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే చాలా మంది ప్రజలు బడ్జెట్ ప్లాన్‌లతో డబ్బుకు విలువ కోసం చూస్తుంటారు. ఎయిర్‌టెల్ అండ్  జియో వంటి టెలికాం కంపెనీలు వినియోగదారులకు అనేక బడ్జెట్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటితో కస్టమర్‌లు హై-స్పీడ్ డేటా, ఆన్ లిమిటెడ్  కాల్స్ అండ్  SMS బెనిఫిట్స్ పొందవచ్చు.
 

Ashok Kumar | Updated : Sep 09 2023, 01:04 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఎయిర్‌టెల్ vs జియో

ఎయిర్‌టెల్ లేదా జియో చూస్తే  రూ.299 ప్లాన్‌తో  ఏ నెట్వర్క్ ఎక్కువ బెనిఫిట్స్  అందిస్తుందో చూద్దాం... రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ వాలిడిటీ పీరియడ్ 28 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 2GB డేటా ప్రకారం మొత్తం 56GB డేటాను పొందుతారు. డైలీ డేటా లిమిట్  ముగిసిన తర్వాత, నెట్ స్పీడ్ 64Kbpsకి తగ్గించబడుతుంది. ఈ ప్యాక్‌తో వినియోగదారులు ఆన్ లిమిటెడ్  వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు.
 

24
Asianet Image

ఎయిర్‌టెల్ vs జియో ప్లాన్

ఈ ప్లాన్ కూడా 100   ఉచిత SMSలను అందిస్తుంది. ఈ Jio  ప్లాన్‌తో  కస్టమర్‌లు JioTV, JioCinema, JioSecurity ఇంకా JioCloudకి ఫ్రీ  షబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు   రూ. 299 రీఛార్జ్ చేసుకుంటే 7 GB అదనపు డేటాను పొందవచ్చు. అంటే రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 63 జీబీ డేటా లభిస్తుంది.

34
Asianet Image

 ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్‌తో మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకుంటే  మీరు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్  లోకల్ అండ్  STD కాల్స్  చేసుకోవచ్చు. దీని వాలిడిటీ 28 రోజులు. అలాగే, మీరు రోజుకు 1.5GB 4G డేటాను పొందుతారు. అంటే మీకు నెల మొత్తం 42GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారు.
 

44
Asianet Image

రిలయన్స్ జియో  రూ.299 ప్లాన్‌తో మొత్తం 63GB డేటాను అందిస్తోంది. అయితే, ఇందులో 56GB డేటా అందుబాటులో ఉంటుంది, అయితే Jio 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున కంపెనీ 7GB అదనపు డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్‌తో  42జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే Jio 21GB ఎక్కువ డేటాను అందిస్తోంది.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories