MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • WhatsApp : మీ వాట్సాప్ లో ఆప్షన్ ఆన్ చేయండి.. లేదంటే మీ చాట్స్ లీక్ అవ్వడం ఖాయం!

WhatsApp : మీ వాట్సాప్ లో ఆప్షన్ ఆన్ చేయండి.. లేదంటే మీ చాట్స్ లీక్ అవ్వడం ఖాయం!

WhatsApp Tips : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ వాడుతున్నా అందులోని ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్‌ను చాలామంది ఇంకా ఆన్ చేసుకోవడం లేదట. దీనివల్ల ఏళ్ల తరబడి దాచుకున్న వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 06 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక
Image Credit : Gemini AI

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక

ఈ డిజిటల్ యుగంలో కోట్లాది మంది రోజూ వాట్సాప్ వాడుతున్నారు. ఫ్రెండ్స్‌తో మాట్లాడటం నుంచి ఆఫీస్ ఫైల్స్ పంపడం వరకు ఎన్నో పనులకు ఇదే ఆధారం. కొందరు పర్సనల్ ఫోటోలు, వీడియోలను కూడా తమకు చాలా దగ్గరివారికి పంపిస్తుంటారు. ఇలా కీలకమైన సమాచారాన్ని షేర్ చేసే వాట్సాప్ లో డేటా భద్రత గురించి చాలామంది పెద్దగా పట్టించుకోవట్లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాట్సాప్ లో భద్రత చాలా ముఖ్యం
Image Credit : Getty

వాట్సాప్ లో భద్రత చాలా ముఖ్యం

వాట్సాప్‌లో మనం పంపే, మనకు వచ్చే మెసేజ్‌లకు 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' భద్రత ఉంటుంది. అంటే పంపిన వారు, అందుకున్న వారు తప్ప మధ్యలో ఎవరూ చదవలేరు. కానీ చాలామంది తమ చాట్స్, ఫోటోలను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేస్తుంటారు. మరి ఆ బ్యాకప్‌లు ఎంతవరకు సురక్షితం అనేది అసలు ప్రశ్న.

35
ఈ భద్రత ఫీచర్ ఎందుకు అవసరం?
Image Credit : Getty

ఈ భద్రత ఫీచర్ ఎందుకు అవసరం?

ఒకవేళ మీ క్లౌడ్ అకౌంట్ హ్యాక్ అయితే, ఏళ్ల తరబడి మీరు దాచుకున్న పర్సనల్ విషయాలన్నీ బయటకు లీక్ అవుతాయి. వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ వివరాలు కూడా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే వాట్సాప్ 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్' ఫీచర్‌ను అందిస్తోంది.
45
ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
Image Credit : Getty

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ 'Chats' ఆప్షన్ ఎంచుకుని, 'Chat Backup' మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత 'End-to-End Encrypted Backup' ఆప్షన్‌ను 'Enable' చేసి, ఒక పటిష్టమైన పాస్‌వర్డ్ లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీని క్రియేట్ చేసుకోండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు.
55
కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు
Image Credit : Getty

కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, మన పర్సనల్ డేటాను కాపాడుకోవడం చాలా అవసరం. కేవలం కొన్ని నిమిషాల్లో యాక్టివేట్ చేసుకోగల ఈ సెక్యూరిటీ ఫీచర్, భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి, వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్‌ను వెంటనే ఆన్ చేసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone Offers: రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్..తక్కువ ధరకే ఐఫోన్లు.. కొనేముందు ఇవి తెలుసుకోండి
Recommended image2
PM Modi Phone: ప్రధాని మోదీ వాడే ఫోన్ ఏదో తెలుసా? దీని ఫీచర్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Recommended image3
Diwali Scam: ఈ జాగ్రత్తలు పాటిస్తే దీపావళి బోనస్ స్కాం నుంచి బయటపడొచ్చు
Related Stories
Recommended image1
WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్! వెంటనే ఇలా చేయండి
Recommended image2
WhatsApp Call Recording : ఈ సింపుల్ ట్రిక్స్ తో.. వాట్సాప్‌ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved