- Home
- Technology
- 3D Printing: మీకు కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలని ఉందా.? సింపుల్ స్టెప్స్‌తో తెలుసుకోండి
3D Printing: మీకు కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలని ఉందా.? సింపుల్ స్టెప్స్‌తో తెలుసుకోండి
3D Printing: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వైరల్ అవుతోంది. మన ఫొటోలను 3డీ ప్రింటింగ్‌లోకి మార్చుకొని పోస్టు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంతకీ ఫొటోలను ఎలా డిజైన్ చేసుకోవాలంటే..

ఏఐ రాకతో మారిన ట్రెండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సోషల్ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. చనిపోయిన వారు మాట్లాడుతున్నట్లు, ఒక చిన్న ప్రాంప్ట్‌తో మీ ఫొటోను నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకునేలా ఇలా రకరకాల కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఓ ట్రెండ్ వైరల్ అవుతోంది. వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాపోస్టుల్లో, ఫేస్‌బుక్ వాల్‌పై ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిని నానో బనానో ట్రెండ్ గా పిలుస్తున్నారు.
ఏంటీ 3డీ ప్రింటింగ్ ఫొటోలు
ఒక ఫొటోను 3డీ ప్రింటింగ్ విధానంలో బొమ్మలా తయారు చేయడం కొత్తది ఏం కాదు. ఇలాంటి వాటిని రియల్‌గా తయారు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అయితే అచ్చంగా 3డీ ప్రింటింగ్‌ను పోలినట్లు మన ఫొటోలను డిజైన్ చేసే ఒక ఫీచర్‌ను గూగుల్ జెమిని ఏఐలో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ విధానంలో 3డీ ఫొటోలను ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు గూగుల్‌లోకి వెళ్లాలి
ఇందుకోసం ముందుగా గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్లి జెమినీ ఏఐ అని టైప్ చేయండి. అనంతరం మొదట కనిపించే గూగుల్ జెమినీ ఏఐ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. లేదంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి జెమినీ ఏఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న సరిపోతుంది.
ఆస్క్ జెమినీ
ఆ తర్వాత ఆస్క్ జెమినీ అనే ఆప్షన్ కింద్ + బటన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత కెమెరా, అప్‌లోడ్ ఫైల్స్, ఆడ్ ఫ్రమ్ డ్రైవ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో అప్‌లోడ్ ఫైల్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
ఈ ప్రాంప్ట్ ఇవ్వాలి.
అనంతరం మీ ఫొటో కింద కనిపించే ఖాళీ స్థలంలో ఇంగ్లిష్‌లో Create a 1/6 scale commercialized figure of the character in the illustration, in a realistic style and environment. Place the figures on a clear acrylic stand. Next to the computer screen, display the ZBrush modeling process of the figure. Next to the computer screen, place a [Swathi] toy packaging box with the title "3D Model printing" printed with the original artwork ఈ ప్రాంప్ట్‌ని అందించాలి. అంతే ఒక 10 సెకండ్లలో మీ ఫొటో 3డీ మోడల్ ప్రింటింగ్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఈ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు.