MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • WhatsApp : మీ ఫోన్ నెంబర్ కనిపించకుండానే వాట్సాప్ లో చాట్ చేయవచ్చు.. అదెలాగో తెలుసా?

WhatsApp : మీ ఫోన్ నెంబర్ కనిపించకుండానే వాట్సాప్ లో చాట్ చేయవచ్చు.. అదెలాగో తెలుసా?

ఇకపై కొత్త వ్యక్తులతో వాట్సాప్ లో చాట్ చేయడానికి మీ ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన పనిలేదు. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌తో ఇది సాధ్యం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 30 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాాట్పాప్ లో గేమ్ ఛేంజర్ ఫీచర్
Image Credit : Gemini AI

వాాట్పాప్ లో గేమ్ ఛేంజర్ ఫీచర్

కాలేజీ, అపార్ట్‌మెంట్ లేదా పిల్లల స్కూల్ గ్రూపుల్లో చేరినప్పుడు మన ఫోన్ నంబర్ అందరికీ తెలిసిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు నంబర్‌తో లింక్ అయి ఉండటంతో ఇది పెద్ద ప్రైవసీ సమస్య. దీనికి పరిష్కారంగా వాట్సాప్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది…. అదే యూజర్‌నేమ్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ ఫోన్ నంబర్ కు బదులు కేవలం యూజర్‌నేమ్ మాత్రమే కనిపిస్తుంది. దీంతో మీ ప్రైవసీకి పూర్తి భద్రత లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాట్సాప్ లో అదనపు భద్రతా ఫీచర్లు
Image Credit : Gemini

వాట్సాప్ లో అదనపు భద్రతా ఫీచర్లు

వాట్సాప్ యూజర్లకు కొత్తగా రెండు ముఖ్యమైన భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ లేకుండా ఓ ఫీచర్ తీసుకువచ్చింది… అంటే మీ యూజర్‌నేమ్ ను ఎవరైనా ర్యాండమ్ గా సెర్చ్ చేసి తెలుసుకోవాలంటే కుదరదు. కచ్చితంగా తెలిస్తేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. రెండోది  'యూజర్‌నేమ్ కీ' సెట్ చేసుకునే అవకాశం. ఈ కీ తెలిసిన వాళ్లు మాత్రమే మీకు మొదటిసారి మెసేజ్ పంపగలరు.

Related Articles

Related image1
Tech News: బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌తో క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇందులో నిజ‌మెంత‌..
Related image2
Agri Technology : పశువులు మేపడానికి 'డిజిటల్ స్టిక్' ఏంటి భయ్యా..! దీని హైటెక్ ఫీచర్లు తెలిస్తే షాక్..!!
35
యూజర్ నేమ్ ఇప్పుడే ఎందుకు రిజర్వ్ చేసుకోవాలి?
Image Credit : AI Generated

యూజర్ నేమ్ ఇప్పుడే ఎందుకు రిజర్వ్ చేసుకోవాలి?

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. అందుకే మీకు నచ్చిన పేరును వేరొకరు తీసుకోకముందే రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ పేరు దొరక్కపోతే, వాట్సాప్‌లోని 'యూజర్‌నేమ్ జనరేటర్' మీకు సహాయం చేస్తుంది. క్రియేటర్లు, వ్యాపార సంస్థలు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లనే ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

45
వాట్సాప్ యూజర్‌నేమ్‌ను ఎలా రిజర్వ్ చేసుకోవాలి?
Image Credit : Chatgpt

వాట్సాప్ యూజర్‌నేమ్‌ను ఎలా రిజర్వ్ చేసుకోవాలి?

మీ వాట్సాప్ యూజర్‌నేమ్ రిజిస్టర్ చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'అకౌంట్' ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ కొత్తగా కనిపించే 'యూజర్‌నేమ్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీకు నచ్చిన పేరును టైప్ చేసి సేవ్ చేసుకోండి.

55
యూజర్ నేమ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
Image Credit : stockPhoto

యూజర్ నేమ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రస్తుతం దశలవారీగా విడుదల చేస్తున్నారు. మీ అకౌంట్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ మీకు నోటిఫికేషన్ పంపుతుంది. ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్ వస్తుందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Plus Features: వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. నెలకు ₹79 పే చేస్తే వచ్చే 6 సూపర్ ఫీచర్లు ఏంటో తెలుసా?
Recommended image2
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Recommended image3
Samsung Galaxy M47 5G : భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ
Related Stories
Recommended image1
Tech News: బ్లూటూత్ ఇయ‌ర్‌ఫోన్స్‌తో క్యాన్స‌ర్ వ‌స్తుందా.? ఇందులో నిజ‌మెంత‌..
Recommended image2
Agri Technology : పశువులు మేపడానికి 'డిజిటల్ స్టిక్' ఏంటి భయ్యా..! దీని హైటెక్ ఫీచర్లు తెలిస్తే షాక్..!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved