WhatsApp: వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? డౌన్‌లోడ్ క్వాలిటీ ఫీచర్‌తో ఆ సమస్యే ఉండదు
వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? ఏ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలో తెలియడం లేదా? ఇకపై ఈ సమస్య ఉండదు. కొత్త అప్ డేట్ లో 'డౌన్‌లోడ్ క్వాలిటీ' అనే ఫీచర్ రాబోతోంది. దీని వల్ల ఫోన్ స్టోరేజ్ సేవ్ అవడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
స్టోరేజ్ నిండిపోవడం అందరికీ సమస్యే..
స్టోరేజ్ త్వరగా నిండిపోవడం ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ ఎదుర్కొనే సమస్యే. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవడం వల్ల స్టోరేజ్ చాలా త్వరగా నిండిపోతుంది. దీనికి పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. 'డౌన్‌లోడ్ క్వాలిటీ' అనే ఈ ఫీచర్, యూజర్లు వచ్చే మీడియాను HD లేదా SDలో సేవ్ చేసుకోవాలా అని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఆటో డౌన్‌లోడ్ అయ్యే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోల వల్ల స్టోరేజ్ సమస్య తగ్గుతుంది.
ఏం పంపించాలన్నా వాట్సాప్ లోనే..
ఈ డిజిటల్ ప్రపంచంలో వాట్సాప్ ఒక్క చాటింగ్ కోసమే వాడటం లేదు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను షేర్ చేసుకునేందుకు కూడా వాట్సాప్ బెస్ట్ ప్లాట్ ఫాంగా మారింది. స్టార్టింగ్ లో స్నేహితుల మధ్య సరదా సంభాషణ కోసం వాట్సాప్ ఉపయోగించేవారు. ఆ తర్వాత ఆఫీస్ అవసరాలకు, బిజినెస్ సౌకర్యాలకు కూడా వాట్సాప్ ప్రధాన ఆప్షన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఏ ఫోటో, వీడియో, డాక్యుమెంట్, ఫైల్ ఇలా ఏది పంపించాలన్నా వాట్సాప్ చెయ్ అంటుంటారు. అంతలా వాట్సాప్ మన జీవితంలో భాగమైపోయింది.
హై క్వాలిటీ కంటెంట్ వల్లే స్టోరేజ్ సమస్య
చాలా మంది యూజర్లు చాలా యాక్టివ్ గ్రూపుల్లో ఉండటం వల్ల రోజూ చాలా మీడియా ఫైల్స్ వస్తుంటాయి. అందులో హై క్వాలిటీ, లో క్వాలిటీ రెండూ ఉంటాయి. లో క్వాలిటీ కంటెంట్ తక్కువ స్పేస్ తీసుకున్నా, హై క్వాలిటీ కంటెంట్ మాత్రం ఆటోమెటిక్ గా ఎక్కువ స్టోరేజ్ తీసేసుకుంటుంది. దీంతో ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. వాట్సాప్ ఇప్పటికే హై క్వాలిటీ ఫోటోలను పంపడానికి అనుమతిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువగా అందుకోవడం వల్ల చాలా స్మార్ట్‌ఫోన్లలో స్టోరేజ్ సమస్యలు వస్తున్నాయి.
త్వరలో ‘డౌన్‌లోడ్ క్వాలిటీ’ ఫీచర్
WA Beta Info తెలిపిన సమాచారం ప్రకారం ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 కోసం వాట్సాప్ బీటాలో కనిపించింది. దీని ద్వారా మీడియా ఫైల్స్ డౌన్‌లోడ్ అవ్వకముందే HD లేదా SD క్వాలిటీని ఎంచుకునే ఆప్షన్ యూజర్లకు లభిస్తుంది.
ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉందో లేదో చెక్ చేయాలంటే..
సెట్టింగ్స్ లోకి వెళ్లండి. స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ లో ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటే మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోండి.
అప్‌డేట్‌తో అన్ని ఫోన్లకు అందుబాటులోకి..
ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లు మాత్రమే ఉపయోగించే విధంగా అందుబాటులో ఉంది. మీ ఫోన్ సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే త్వరలో రానున్న అప్ డేట్ లో ఈ ఫీచర్ ని పొందుతారు.
ఈ సింపుల్ ఫీచర్ వల్ల ఫోన్ స్టోరేజ్ సమస్య తీరుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.