- Home
- Technology
- Gadgets
- Best Smartphones : 2025లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఐఫోన్ నుంచి ఐక్యూ వరకు పూర్తి వివరాలు !
Best Smartphones : 2025లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఐఫోన్ నుంచి ఐక్యూ వరకు పూర్తి వివరాలు !
Best Smartphones of 2025 : భారతదేశంలో 2025లో చాలా ఫోన్లు విడుదల అయ్యాయి. అయితే, కొన్ని ఫోన్లు మాత్రం తమదైన ముద్ర వేశాయి. ఐక్యూ 13, ఐఫోన్ 17, శాంసంగ్ ఎస్25 వంటి ప్రీమియం ఫోన్‌లు ఈ ఏడాది ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరాయి.

Best Smartphones 2025 : ఐఫోన్ 17 vs శాంసంగ్ S25.. ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది? ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది సరికొత్త పుంతలు తొక్కింది. ప్రతి సంవత్సరం వందలాది స్మార్ట్‌ఫోన్‌లు దేశంలో లాంచ్ అవుతున్నప్పటికీ, కేవలం కొన్ని మాత్రమే యూజర్ల ఆదరణను పొందుతాయి. ఈ ఏడాది ముఖ్యంగా ప్రీమియం మొబైల్స్ విభాగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. తయారీదారులు ఇప్పుడు ప్రతి ధరల విభాగంలోనూ అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నారు. ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరాల నుంచి భారీ బ్యాటరీల వరకు వినియోగదారులకు చాలా ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
ముఖ్యంగా ఈ ఏడాది దీపావళికి ముందు వచ్చిన పండుగ సీజన్‌లో ఐదు ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. వాటి పోటీ ధరలు, అత్యాధునిక టెక్నాలజీ కారణంగా హాట్ టాపిక్ గా నిలిచాయి. గేమింగ్ ప్రియుల కోసం రూపొందించిన ఐక్యూ 13 (iQOO 13) నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ 17 (iPhone 17) వరకు, ఈ ఏడాది టాప్ లేపిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐక్యూ 13 : గేమర్స్ ఛాయిస్
వివో (Vivo) సబ్-బ్రాండ్ నుంచి వచ్చిన పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 13 (iQOO 13). ఇది ముఖ్యంగా గేమర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది.
- పనితీరు : ఇందులో గరిష్ఠంగా 16GB RAM, 512GB స్టోరేజ్ సామర్థ్యం ఉంది. అంతేకాకుండా, గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి ప్రత్యేకమైన Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను కూడా ఇందులో అమర్చారు.
- కెమెరా: ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు మూడు 50MP కెమెరాల సెటప్ (మెయిన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో) ఉంది. సెల్ఫీల కోసం 32MP కెమెరాను అందించారు.
- బ్యాటరీ: ఇందులో భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ధర: దీని ధర రూ. 54,999 నుంచి ప్రారంభమవుతుంది.
వన్‌ప్లస్ 13s : కాంపాక్ట్ పవర్
ఫ్లాగ్‌షిప్ పవర్‌ను కోరుకుంటూనే, చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ డిజైన్‌ను ఇష్టపడే వారికి వన్‌ప్లస్ 13s (OnePlus 13s) సరైన ఎంపిక.
- పనితీరు : ఈ ఫోన్ కూడా శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
- కెమెరా: వెనుక వైపు డ్యుయల్ 50MP కెమెరాలను అందించారు. ముందు భాగంలో వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP సెన్సార్ ఉంది.
- బ్యాటరీ: రోజంతా బ్యాకప్ కోసం 5,850mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
- ధర: ఈ ఫోన్ ధర రూ. 52,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S25 : ప్రీమియం ఇంజనీరింగ్
శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రీమియం ఇంజనీరింగ్, స్లీక్ డిజైన్‌తో గెలాక్సీ S25 (Samsung Galaxy S25) ని తీసుకువచ్చింది.
- పనితీరు: ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పాటు 12GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
- కెమెరా: ఇందులో అధిక పనితీరు కనబరిచే 50MP మెయిన్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
- బ్యాటరీ: 4,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
- ధర: దీని ధర రూ. 74,999.
గూగుల్ పిక్సెల్ 10 : ఏఐ పవర్‌హౌస్
గూగుల్ తన లేటెస్ట్ ఏఐ (AI) ఆవిష్కరణలను పిక్సెల్ 10 (Google Pixel 10) ద్వారా పరిచయం చేసింది. ఇది ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంటెలిజెన్స్, ఫోటోగ్రఫీపై దృష్టి సారించింది.
- పనితీరు : గూగుల్ సొంతంగా తయారు చేసిన కస్టమ్ టెన్సర్ G5 (Tensor G5) ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో 12GB RAM ఉంది.
- కెమెరా: వెనుక వైపు 48MP మెయిన్ సెన్సార్ ఉంది. ముందు వైపు సహజమైన స్కిన్ టోన్‌ల కోసం ఆప్టిమైజ్ చేసిన 10.5MP కెమెరాను అందించారు.
- బ్యాటరీ: 4,970mAh బ్యాటరీతో పాటు వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
- ధర: పిక్సెల్ 10 ధర రూ. 79,999.
ఆపిల్ ఐఫోన్ 17 : సరికొత్త హార్డ్‌వేర్
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన డివైజ్‌లలో ఐఫోన్ 17 (Apple iPhone 17) ఒకటి. ఇది అనేక ముఖ్యమైన హార్డ్‌వేర్ మార్పులతో వచ్చింది.
- పనితీరు: ఇందులో సరికొత్త A19 చిప్‌ను అమర్చారు. స్టోరేజ్ ఆప్షన్లు 1TB వరకు అందుబాటులో ఉన్నాయి.
- ప్రత్యేక ఫీచర్లు: ఫోటోగ్రఫీ కోసం కొత్తగా డెడికేటెడ్ కెమెరా బటన్‌ను (Camera Button) ఇందులో తీసుకొచ్చారు.
- కెమెరా: వెనుక వైపు 48MP కెమెరా ఉంది. ముందు వైపు గతంలో ఉన్న 18MPకి బదులుగా, అప్గ్రేడ్ చేసిన 24MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరాను అందించారు.
- ధర: ఐఫోన్ 17 ధర రూ. 82,900 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఐదు స్మార్ట్‌ఫోన్‌లు 2025లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. పనితీరు, కెమెరా నాణ్యత, బ్యాటరీ లైఫ్ వంటి అంశాల్లో ఇవి వినియోగదారులకు హాట్ కేకుల్లా మారాయి.

