Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • Tech News
  • ఫోన్ చూడ‌కుండానే మీకు వాట్సాప్ చేసింది ఎవ‌రో తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే?

ఫోన్ చూడ‌కుండానే మీకు వాట్సాప్ చేసింది ఎవ‌రో తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే?

Whatsapp: దాదాపు ప్ర‌తీ ఒక్క‌రి ఫోన్‌లో వాట్సాప్‌లో ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్ప‌టికప్పుడు కొంగొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తోంది కాబ‌ట్టే వాట్సాప్‌కు ఇంత క్రేజ్ ఉంది. అయితే వాట్సాప్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో హిడెన్ ట్రిక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : May 16 2025, 04:48 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Whats App

Whats App

వాట్సాప్‌కి మెసేజ్ వస్తే అది ఎవరు పంపారో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఫోన్‌ చూసే అవసరం ఉంటుంది. అయితే ఫోన్ దూరంగా ఉంటే ఇబ్బందిగా మారుతుంది. అయితే ఓ చిన్న సెట్టింగ్‌తో ఫోన్ చూడ‌కుండానే మీ వాట్సాప్‌కు ఎవ‌రు మెసేజ్ చేశారో తెలుసుకోవ‌చ్చు. ఇంత‌కీ ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
Asianet Image

మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌కి ఒక్కొక్కరికి ఒక రింగ్‌టోన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా, ఒకరు మెసేజ్ చేసినప్పుడు ఫోన్‌లో వచ్చే సౌండ్‌ బట్టి ఎవరు మెసేజ్ పంపారో మీరు అంచనా వేసేయచ్చు. ఇది మీరు ఫోన్‌తో లేనప్పటికీ మెసేజ్‌ ఎవరిది అనేది ముందుగానే తెలుసుకునే అదునైన పద్ధతి. ఇందుకోసం ఏం చేయాలంటే.. 
 

Related Articles

Honda Activa 7G: సిటీ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ హోండా ఆక్టివా 7G: ఫీచర్స్ ఎంత బాగున్నాయో
Honda Activa 7G: సిటీ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ హోండా ఆక్టివా 7G: ఫీచర్స్ ఎంత బాగున్నాయో
Salary Account: మీకు శాలరీ అకౌంట్‌ ఉందా?  అయితే.. ఈ ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..
Salary Account: మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? అయితే.. ఈ ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..
35
Asianet Image

ఆండ్రాయిడ్‌: 

* ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. 

* త‌ర్వాత చాట్స్ ట్యాబ్‌కి వెళ్లి రింగ్‌టోన్ సెట్ చేయాలనుకునే కాంటాక్ట్‌ ఓపెన్ చేయండి.

* టాప్‌లో ఉన్న వారి పేరును టాప్ చేసి, వారి ప్రొఫైల్‌లోకి వెళ్లండి.

45
Asianet Image

* క‌స్ట‌మ్ నోటిఫికేష‌న్స్ అనే ఆప్షన్ ఉంటుంది – దాన్ని ఎనేబుల్ చేయండి.

* ఇప్పుడు మీరు Notification tone, Call ringtone వంటి ఆప్షన్లను మార్చవచ్చు.

* మీకు న‌చ్చిన రింగ్‌టోన్‌ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. 

55
Asianet Image

ఐఫోన్‌లో: 

* వాట్సాప్ ఓపెన్ చేసి, చాట్స్ ట్యాబ్‌కి వెళ్లండి.

* అవసరమైన కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేయండి.

* చాట్ విండోలో పై భాగంలో కాంటాక్ట్ నేమ్‌పై ట్యాప్ చేయండి.

* త‌ర్వాత Wallpaper & Sound అనే ఆప్షన్ కనిపిస్తుంది.

* దాన్ని క్లిక్ చేసి, Alert Tone ఎంచుకుని మీకు నచ్చిన టోన్‌ను ఎంపిక చేసుకోండి. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
సాంకేతిక వార్తలు చిట్కాలు
 
Recommended Stories
Top Stories