MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • చిక్కుల్లో జైస్వాల్.! ఇకపై సెలెక్ట్ చేయమంటూ సెలెక్టర్ల గుర్రు..

చిక్కుల్లో జైస్వాల్.! ఇకపై సెలెక్ట్ చేయమంటూ సెలెక్టర్ల గుర్రు..

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్ పట్ల నిబద్ధతపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని కోరినా స్పందన రాకపోవడంతో.. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 29 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జైస్వాల్ తీరుపై విమర్శలు
Image Credit : BCCI\Twitter

జైస్వాల్ తీరుపై విమర్శలు

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్ పట్ల నిబద్ధతపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జైస్వాల్ తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని, అతని పట్ల ఎంసీఏ గుర్రుగా ఉందని సమాచారం. ఇటీవల బీసీసీఐ జాతీయ జట్టు ఆటగాళ్లను దేశీయ క్రికెట్‌లో ఆడాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యశస్వి జైస్వాల్ సైతం సొంత జట్టు..
Image Credit : BCCI\Twitter

యశస్వి జైస్వాల్ సైతం సొంత జట్టు..

బీసీసీఐ ఆదేశాలకు అనుగుణంగానే విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున, రోహిత్ శర్మ ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ సైతం సొంత జట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. హైదరాబాద్‌తో ముగిసిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత పొందింది.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
35
 జైస్వాల్‌ను ఎంపిక చేయబోమని..
Image Credit : BCCI\Twitter

జైస్వాల్‌ను ఎంపిక చేయబోమని..

తదుపరి మ్యాచ్ సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సహా వెటరన్ స్టార్ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ కీలక సమయంలో, ఎంసీఏ సెలెక్టర్లు ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్‌ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో జైస్వాల్‌ను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.

45
హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును..
Image Credit : BCCI\Twitter

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును..

ఈ విషయంపై ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ, "హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాం. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. తనకి నచ్చినప్పుడు నచ్చిన మ్యాచ్‌లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. తదుపరి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా లేదా అని అడిగినప్పుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతని పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదని" పేర్కొన్నారు.

55
ఢిల్లీతో మ్యాచ్‌కు..
Image Credit : BCCI\Twitter

ఢిల్లీతో మ్యాచ్‌కు..

కాగా, ఢిల్లీతో మ్యాచ్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఎంసీఏతో జైస్వాల్‌కు సమస్యలు వచ్చాయి. అప్పుడు అతను గోవా జట్టుకు వెళ్లాలని భావించాడు కానీ చివరి నిమిషంలో ఆ ప్రణాళికను రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే రకమైన సమస్య ఏదైనా వచ్చిందా అని అభిమానులు అనుకుంటున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved