MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : అతిచిన్న వయసులో అద్భుత సెంచరీ.. ఎవరీ యువరాజ్ సమ్రా.. ఇండియాతో లింక్ ఏంటి?

T20 World Cup 2026 : అతిచిన్న వయసులో అద్భుత సెంచరీ.. ఎవరీ యువరాజ్ సమ్రా.. ఇండియాతో లింక్ ఏంటి?

యువరాజ్ సమ్రా… వరల్డ్ క్రికెట్ లో ఈ పేరు గట్టిగానే వినిపించేలా కనిపిస్తోంది. ఈ భారత సంతతి కెనడా ప్లేయర్ కేవలం 19 ఏళ్ల వయసులోనే టీ20 వరల్డ్ కప్ ఆడుతూ సెంచరీ బాదాడు.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 18 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ యువరాజ్ మామూలోడు కాదు గురూ..!
Image Credit : Getty

ఈ యువరాజ్ మామూలోడు కాదు గురూ..!

Yuvraj Samra : టీ20 వరల్డ్ కప్ 2026 లో ప్రధాన జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి పసికూనలు. జింబాబ్వే దెబ్బకు ఆస్ట్రేలియా టీం టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది... పాకిస్థాన్ కు కూడా అమెరికా గట్టి పోటీ ఇస్తోంది. ఇలా పసికూనలుగా చెప్పుకునే టీం పవర్ ఫుల్ ఇన్నింగ్ ఆడుతున్నాయి... ఆ జట్ల ఆటగాళ్ల అద్భుతాలు చేస్తున్నారు. ఇలా కెనడాకు చెందిన భారత సంతతి ఆటగాడు యువరాజ్ సమ్రా అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ రికార్డు...
Image Credit : Getty

టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ రికార్డు...

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 17న న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కెనడాకు ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత ఆరంభం అందించాడు. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వాతో కలిసి ఏకంగా 116 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇలా అద్భుతంగా ఆడిన యువరాజ్ కేవలం 65 బంతుల్లోనే 110 పరుగులు (6 సిక్సులు, 11 ఫోర్లు) చేశాడు.

యువరాజ్ ఒక్క సెంచరీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించాడు. అతిచిన్న వయసులో (19 ఏళ్ళ 141 రోజులు) టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ రికార్డు ఇతడిపేరిట నమోదయ్యింది. ఇదే యువరాజ్ కెరీర్ లో ఇప్పటివరకు అత్యుత్తమ స్కోరు. 

Related Articles

Related image1
T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?
Related image2
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
35
పాకిస్థానీ రికార్డు యువరాజ్ ఎసరు...
Image Credit : X@ICC

పాకిస్థానీ రికార్డు యువరాజ్ ఎసరు...

పాక్ పరువు తీయాలంటే టీమిండియా ప్లేయరే కావాలా ఏంటి.. ఇండియన్ బ్లడ్ శరీరంలో ప్రవహిస్తున్నా చాలు అని యువరాజ్ సమ్రా నిరూపించాడు. అతడు న్యూజిల్యాండ్ పై సెంచరీ బాదినా రికార్డు మాత్రం పాకిస్థాన్ ప్లేయర్ ది బద్దలయ్యింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అతిచిన్న వయసులో సెంచరీ బాదిన రికార్డు పాక్ ప్లేయర్ అహ్మద్ షహజాద్ పేరిట ఉండేది... అతడు 22 ఏళ్ల వయసులో సెంచరీ చేశాడు. కానీ ఈ రికార్డును యువరాజ్ సమ్రా బద్దలుగొట్టాడు.

45
ఎవరి యువరాజ్ సమ్రా..? యువరాజ్ సింగ్ కు లింక్ ఉందా..?
Image Credit : Getty

ఎవరి యువరాజ్ సమ్రా..? యువరాజ్ సింగ్ కు లింక్ ఉందా..?

యువరాజ్ సమ్రా కెనడాలోని భారత సంతతి కుటుంబంలో జన్మించాడు. పంజాబ్ కు చెందిన బల్జీత్ సమ్రా ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లి కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు.. అతడి కొడుకే ఈ యువరాజ్. క్రికెట్ ను బాగా ఇష్టపడే బల్జీత్ టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ వీరాభిమాని. అందుకే కొడుకుకు యువరాజు అని పేరుపెట్టాడు.

తన కొడుకును గొప్ప క్రికెటర్ గా చూడాలన్నది బల్జీత్ కల... అందుకే చిన్నప్పటినుండి యువరాజ్ కు క్రికెట్ లో శిక్షణ ఇప్పించాడు. కెనడాలో క్రికెట్ కోచింగ్ కష్టంగా ఉండటంతో ఇండియా, అమెరికాల్లో శిక్షణ ఇప్పించాడు. ఇలా క్రికెట్ లో మెలకువలు నేర్చుకున్న యువరాజ్ కెనడా జట్టులో చోటు సంపాదించాడు.

కెనడా క్రికెట్ టీం తరపున టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం రావడంతో తానేంటో నిరూపించుకోవాలని యువరాజ్ సమ్రా భావించాడు. ఈ క్రమంలో న్యూజిల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. ఇలా తానెంతో ఇష్టపడే యువరాజ్ సింగ్ చేత శభాష్ అనిపించుకునే స్థాయికి చేరుకున్నాడు.

55
యువరాజ్ సెంచరీ బాదినా ఓడిన కెనడా
Image Credit : Getty

యువరాజ్ సెంచరీ బాదినా ఓడిన కెనడా

యువరాజ్ సమ్రా న్యూజిల్యాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు... అద్బుత సెంచరీతో రికార్డులు బద్దలుగొట్టాడు.. ఇంతచేసినా కెనడాకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసి కెనడా విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే చేధించింది న్యూజిల్యాండ్. రచిన్ రవీంద్ర 39 బంతుల్లో 59 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 36 బంతుల్లో 76 పరుగులతో రెచ్చిపోవడంతో కెనడా ఓడింది... కానీ యువరాజ్ సమ్రా క్రికెట్ ప్రియుల మనసు గెలుచుకున్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image2
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image3
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Related Stories
Recommended image1
T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?
Recommended image2
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved