MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Anaya Bangar : అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ఇండియన్ క్రికెటర్ .. ఈ ట్రాన్స్ జెెండర్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

Anaya Bangar : అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ఇండియన్ క్రికెటర్ .. ఈ ట్రాన్స్ జెెండర్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ కాస్త కూతురు అనయాగా మారిపోయాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లో జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. తన తండ్రితో కలిసి హాస్పిటల్‌లో ఉన్న ఎమోషనల్ ఫోటోను షేర్ చేశారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 24 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రాన్స్ జెండర్ గా మారిన ఇండియన్ క్రికెటర్
Image Credit : Anaya Bangar Insta

ట్రాన్స్ జెండర్ గా మారిన ఇండియన్ క్రికెటర్

Sanjay Bangar Daughter Anaya Bangar : టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ కాస్త కూతురు అనయా బంగర్ గా మారిపోయాడు. ఇటీవల థాయ్‌లాండ్‌లో జెండర్-అఫర్మింగ్ సర్జరీ (లింగ మార్పిడి చికిత్స) చేయించుకున్నట్లు ఇటీవలే బైటపెట్టారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన సుదీర్ఘ ప్రయాణం గురించి వివరించారు. ఇది ఒక భావోద్వేగభరితమైన, జీవితాన్ని మార్చే క్షణమని ఆమె అభివర్ణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరీ అనయా బంగర్..
Image Credit : social media

ఎవరీ అనయా బంగర్..

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్-వైశాలి దంపతుల కుమారుడు ఆర్యన్ బంగర్. ఇతడు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు... అండర్ 16, అండర్ 19 లో కూడా ఆడాడు. ఇలా అతడు క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాడు.

చిన్నప్పటినుండి హార్మోన్ సమస్యల కారణంగా అమ్మాయిగా ఉండేందుకు ఇష్టపడేవాడు ఆర్యన్... కానీ సమాజం కోసం తన భావాలను బైటపెట్టలేదు. అయితే పెద్దయ్యేకొద్ది ఈ లక్షణాలు పెరగడంతో పూర్తిగా అమ్మాయిగా మారేందుకు సిద్దమయ్యాడు. తల్లిదండ్రులు కూడా అతడి భావాలను గుర్తించి అమ్మాయిగా మారడానికి అంగీకరించారు. దీంతో ఆర్యన్ బంగర్ కాస్త అనయా బంగర్ గా మారారు.

Related Articles

Related image1
అనిల్ కుంబ్లే తర్వాత అతడే.. టీమిండియా స్పిన్నర్ పై సంజయ్ బంగర్ కామెంట్స్
Related image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
35
సంజయ్ బంగర్ తో అనయా.. .
Image Credit : Instagram

సంజయ్ బంగర్ తో అనయా.. .

లింగమార్పిడికి తల్లిదండ్రులు అంగీకరించడంపై అనయా బంగర్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది తన తండ్రి సంజయ్ బంగర్ పక్కనే ఉండటమని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తన కుటుంబం నుంచి లభించిన ప్రేమ, సపోర్ట్ గురించి అనయా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తిగత నిర్ణయాలు, మార్పుల సమయంలో కుటుంబ అంగీకారం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు.

జెండర్-అఫర్మింగ్ సర్జరీ అంటే కేవలం శారీరక మార్పులు మాత్రమే కాదు. ఇది వ్యక్తులు తమ నిజమైన జీవితాన్ని గడిపేలా చేస్తుందన్నారు. ముఖ్యంగా జెండర్ డిస్ఫోరియాతో బాధపడే చాలా మందికి ఇది ఉపశమనం, ఆత్మవిశ్వాసం, అంతర్గత శాంతిని ఇస్తుందన్నారు అనయా బంగర్.

45
అనయా ఎమోషనల్ పోస్ట్..
Image Credit : Instagram

అనయా ఎమోషనల్ పోస్ట్..

''తన జర్నీఅంత ఈజీ కాదు... తనకే కాదు కుటుంబసభ్యులకు కూడా. తన భావాలను అర్థం చేసుకున్నారు... అంగీకరించారు... కీలక సమయంలో తనవెంట నిలబడ్డారు. ఇది వెంటనే జరిగింది కాదు. ఎన్నో ప్రశ్నలు, ఎంతో కన్ప్యూజన్ తర్వాత ఇది జరిగింది. ఈ సమయంలో తండ్రి పక్కన ఉండటం నా జీవితంతో కీలక మూమెంట్. ఆయన సపోర్ట్ కూడా రాత్రికి రాత్రి వచ్చింది కాదు'' అని అనయా ఎమోషన్ అయ్యారు.

''లింగమార్పిడి సర్జరీ అనేది జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. ఎదుగుదలకు సమయం పడుతుంది... ప్రేమకు సమయం పడుతుంది... అన్నింటికంటే ఇవి విలువైనవి. నేను ఎప్పటికీ నాన్నకు రుణపడి ఉంటాను'' అంటూ తండ్రి తన పక్కనే ఉన్న ఫోటోను అనయా పోస్ట్ చేసింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anaya Bangar (@anayabangar)

55
తల్లి, తండ్రి ఇక ఆమే..
Image Credit : Instagram

తల్లి, తండ్రి ఇక ఆమే..

లింగమార్పిడి ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారిన అనయ పిల్లలను కూడా కనేందుకు సిద్దమవుతోంది. ఆమె అమ్మాయిగా మారడానికి ముందే తన వీర్యాన్ని భద్రపర్చుకుంది… దీంతోనే పిల్లలను కంటుందట. ఇలా ఆమె పిల్లలకు తల్లి, తండ్రి కానుంది. ఇలాంటివి విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి... కానీ ఇండియాలో అరుదు. కానీ అనయా బంగర్ ఇది చేసి చూపిస్తానంటోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
అనిల్ కుంబ్లే తర్వాత అతడే.. టీమిండియా స్పిన్నర్ పై సంజయ్ బంగర్ కామెంట్స్
Recommended image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved