MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • IPL : వార్నీ.. 5 పరుగులకే 5 వికెట్లు.. ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ ఇవే

IPL : వార్నీ.. 5 పరుగులకే 5 వికెట్లు.. ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ ఇవే

Top 5 Best Bowling Figures in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఎడిషన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టాప్ 5 బౌలర్లు ఎవరో మీకు తెలుసా? కేవలం 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Best Bowling Figures in IPL : బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు
Image Credit : Gemini

Best Bowling Figures in IPL : బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే పరుగుల ప్రవాహం.. సిక్సర్ల మోత.. ఫోర్ల జాతర.. కానీ, బౌలర్ దెబ్బతో పిచ్‌పై బంతి నిప్పులు చెరిగితే, ఎంతటి మొనగాడైనా పెవిలియన్ దారి పట్టాల్సిందే. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వబోతోంది. మైదానంలో మళ్ళీ బ్యాటర్లు, బౌలర్ల మధ్య యుద్ధం షురూ కానుంది. ఈ తరుణంలో గత సీజన్లలో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ ఐదు అత్యుత్తమ బౌలింగ్ స్పెల్స్ ఏవో మీకు తెలుసా? అతి తక్కువ పరుగులిచ్చి, ఎక్కువ వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన అద్భుతమౌన బౌలింగ్ స్పెల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. అల్జారీ జోసెఫ్ (6/12) - ముంబై ఇండియన్స్
Image Credit : our own

1. అల్జారీ జోసెఫ్ (6/12) - ముంబై ఇండియన్స్

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ బెస్ట్ బౌలింగ్ స్పెల్ రికార్డు అల్జారీ జోసెఫ్ పేరిట ఉంది. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన జోసెఫ్, తన అద్భుత వేగంతో ప్రత్యర్థిని కంగుతినిపించారు. కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అల్జారీ జోసెఫ్ పోషించిన పాత్ర అద్భుతం. ఈ స్పెల్‌లో డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్ వంటి కీలక వికెట్లు ఉన్నాయి. ఈ సూపర్ బౌలింగ్ తో ముంబై జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related Articles

Related image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Related image2
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
37
2. సోహైల్ తన్వీర్ (6/14) - రాజస్థాన్ రాయల్స్
Image Credit : ANI

2. సోహైల్ తన్వీర్ (6/14) - రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ తొలి సీజన్ (2008) లోనే పాకిస్థాన్ పేసర్ సోహైల్ తన్వీర్ ఒక సంచలనం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన తన్వీర్, 14 పరుగులకు 6 వికెట్లు తీశారు. ఆయన వేసిన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాలేదు. దీనివల్ల ధోనీ సేన కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. జోసెఫ్ రికార్డు సృష్టించే వరకు సుమారు 11 ఏళ్ల పాటు తన్వీర్ రికార్డు టాప్ లో ఉంది.

47
3. ఆడమ్ జంపా (6/19) - రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్
Image Credit : Google

3. ఆడమ్ జంపా (6/19) - రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత ప్రదర్శన చేశారు. రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరపున ఆడుతూ ఆయన 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ చరిత్రలో ఆరు వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా జంపా నిలిచారు. అయితే, దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో పూణే జట్టు ఓటమి పాలైంది. అయినప్పటికీ, ఒక స్పిన్నర్‌గా టీ20 ఫార్మాట్‌లో 6 వికెట్లు తీయడం ఇప్పటికీ గొప్ప విషయం.

57
4. అనిల్ కుంబ్లే (5/5) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Image Credit : Getty

4. అనిల్ కుంబ్లే (5/5) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

భారత లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 2009 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కనీవినీ ఎరుగని బౌలింగ్ చేశారు. కేవలం 3.1 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. అంటే ఆయన ఒక్కో వికెట్‌కు సగటున ఒక పరుగు మాత్రమే ఇచ్చారు. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను కుంబ్లే కేవలం 58 పరుగులకే కుప్పకూల్చారు. ఎకానమీ పరంగా చూస్తే ఇది ఇప్పటికీ అత్యుత్తమ బౌలింగ్ స్పెల్.

67
5. ఆకాష్ మధ్వాల్ (5/5) - ముంబై ఇండియన్స్
Image Credit : Asianet News

5. ఆకాష్ మధ్వాల్ (5/5) - ముంబై ఇండియన్స్

2023 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ యంగ్ పేసర్ ఆకాష్ మధ్వాల్ చరిత్ర సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆయన కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. దీని ద్వారా కుంబ్లే పేరిట ఉన్న అత్యంత పొదుపైన 5 వికెట్ల రికార్డును ఆయన సమం చేశారు. ఒక కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఈ స్థాయిలో రాణించడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన ఘనత అని చెప్పాలి.

77
ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్ స్పెల్ : భారత బౌలర్ల ఆధిపత్యం
Image Credit : ANI

ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్ స్పెల్ : భారత బౌలర్ల ఆధిపత్యం

ఐపీఎల్ విదేశీ ఆటగాళ్లతో నిండి ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో భారత ప్లేయర్లు తమ ముద్ర వేశారు. టాప్ 5లో అనిల్ కుంబ్లే, ఆకాష్ మధ్వాల్ ఇద్దరూ 5/5 గణాంకాలతో టాప్ ప్లేస్ కోసం పోటీ పడ్డారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా (5/10), మోహిత్ శర్మ (5/10), ఇషాంత్ శర్మ (5/12) వంటి వారు కూడా అత్యుత్తమ స్పెల్స్ వేసి భారత బౌలింగ్ సత్తాను చాటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత పేసర్లు ప్రపంచ స్థాయి బ్యాటర్లను కట్టడి చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Recommended image2
T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved