చైనా గడ్డపై చాయ్ వాలా కూతురు అద్భుతం... ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ బిడ్డల సత్తాఇది..!
తెలంగాణ ఆడబిడ్డలు అంతర్జాతీయ క్రీడా వేదికలపై సత్తాచాటుతూ దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఇప్పటికే బాక్సింగ్ లో నిఖత్ జరీన్ సత్తా చాటుతుంటే మరో యువ క్రీడాకారిణి నందిని ఆసియా క్రీడల్లో సత్తా చాటింది.

Asian games 2023
హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్ 2023 లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. చైనా వేదికన జరుగుతున్న ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో షూటర్లు పతకాల వేట ప్రారంభిస్తే దాన్ని మిగతా ఆటగాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆడబిడ్డలు కూడా అదరగొట్టి భారత్ కు పతకాలు అందించారు. ఇలా అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన తెలంగాణ ఆడబిడ్డలు నిఖత్ జరీన్, అగసర నందిని యావత్ దేశప్రజలచే కొనియాడబడుతున్నారు.
Nikhat Jareen
ఆసియా క్రీడల్లో బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ అంచనాకు తగ్గట్లుగా రాణించింది. అయితే గోల్డ్ సాధిస్తుందనుకున్న ఆమె కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే చైనాలో అడుగుపెట్టిన మరో తెలంగాణ ఆడబిడ్డ అగరస నందిని అద్భుత ప్రదర్శన కనబర్చింది. హెప్టాథ్లాన్ లో కాంస్యం సాధించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది. ఇలా ఏషియన్ గేమ్స్ లో అదరగొట్టిన తెలంగాణ క్రీడాకారినులు జరీన్, నందిని లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
Asian games 2023
ఆదివారం జరిగిన బాక్సింగ్, హెప్టాథ్లాన్ లో విభాగాల్లో భారత్ కు రెండు కాంస్యాలు లభించాయి. ఈ రెండూ తెలంగాణ బిడ్డలు సాధించినవే. ఇలా ప్రపంచ దేశాల ముందు తెలంగాణ బిడ్డలు సత్తాచాటడంపై హర్షనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డలు యావత్ దేశమే గర్వపడేలా విజయం సాధించారంటూ సీఎం కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అండగా వుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
kcr
తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యాంసంస్థలను ఏర్పాటుచేసి మంచి విద్యను అందించడమే కాదు క్రీడలను ప్రోత్సహిస్తోందని కేసీఆర్ అన్నారు. ఇందుకు ఆసియా క్రీడల్లో గురుకుల విద్యార్థిని నందిని పతకం సాధించడమే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డల ప్రతిభ బయటకు వస్తోందని... అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు సత్తాచాడటం సంతోషకరమని అన్నారు. క్రీడాకారులకు తమ ప్రభుత్వ అండదండలు వుంటాయని... వారికి ప్రోత్సాహం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
Agarasa Nandini
ఎవరీ అగరస నందిని:
తెలంగాణలోని నిరుపేద కుటుంబానికి చెందిన నందిని గురుకులాల్లో చదువుకుంటూనే క్రీడలపై దృష్టిపెట్టింది. ఆమె తండ్రి ఎల్లయ్య చాయ్ వాలా... టీ, కాఫీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కుటుంబ పేదరికం నందిని క్రీడలకు అడ్డుకాలేదు. ఎందుకంటే ఆమె విద్యాభ్యాసమంతా ప్రభుత్వ గురుకులాల్లో సాగింది. నార్సింగిలోకి గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న నందిని ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ (BBA) రెండో సంవత్సరం చదువుతోంది. ఇలా ఓవైపు విద్యాభ్యాసాన్ని కకొనసాగిస్తూనే క్రీడాకారిణిగా రాణిస్తోంది నందిని.
Telangana Sports
నందిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటిన ఆమె ఏషియన్ గేమ్స్ లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. హెప్టాథ్లాన్ లో కాంస్యం సాధించడంతో ఆమెను యావత్ దేశం అభినందిస్తోంది.