MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IND vs SA : ముగ్గురు మొనగాళ్లు.. సూపర్-8లో టీమిండియా మాస్ జాతర మొదలు !

IND vs SA : ముగ్గురు మొనగాళ్లు.. సూపర్-8లో టీమిండియా మాస్ జాతర మొదలు !

India vs South Africa : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి సఫారీలను చెడుగుడు ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురు మొనగాళ్లతో భారత్ సూపర్ మాస్ జాతర మొదలుపెట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 22 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నరేంద్ర మోదీ స్టేడియంలో హై వోల్టేజ్ పోరు
Image Credit : BCCI

నరేంద్ర మోదీ స్టేడియంలో హై-వోల్టేజ్ పోరు

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా, ఇప్పుడు సూపర్-8 రౌండ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.

గ్రూప్-Aలో పాకిస్థాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌పై ఘనవిజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సేన, అదే జోరును సూపర్-8లోనూ కొనసాగించాలని భావిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాను 4-1తో ఓడించిన రికార్డు భారత్‌కు అదనపు బలాన్ని ఇస్తోంది. అయితే, ముగ్గురు భారత మొనగాళ్లు సౌతాఫ్రికాను చెడుగుడు ఆడుకునేందుకు రెడీ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రోటీస్ బౌలర్లకు ఇషాన్ కిషన్ సింహస్వప్నం
Image Credit : Getty

ప్రోటీస్ బౌలర్లకు ఇషాన్ కిషన్ సింహస్వప్నం

ఈ టోర్నమెంట్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఊహించని రీతిలో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 202 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు సాధించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన హై-ప్రెజర్ మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే 77 పరుగులు చేసి సత్తా చాటాడు. 

పవర్ ప్లే ఓవర్లలో ఫీల్డింగ్ నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో ఇషాన్ దిట్ట. ఈ సూపర్ 8 మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ శుభారంభం ఇస్తే, సౌతాఫ్రికాకు కష్టాలు తప్పవు. అహ్మదాబాద్‌లోని ఫ్లాట్ పిచ్‌పై ఇషాన్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది.

34
ఆల్ రౌండ్ షోతో అదరగొట్టనున్న హార్దిక్ పాండ్యా
Image Credit : X@BCCI

ఆల్ రౌండ్ షోతో అదరగొట్టనున్న హార్దిక్ పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అహ్మదాబాద్ స్టేడియం సొంత మైదానం లాంటిది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఇక్కడ అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ పిచ్ స్వభావం, బౌండరీల కొలతలపై హార్దిక్‌కు పూర్తి అవగాహన ఉంది. 

ప్రస్తుత ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయడం, చివర్లో మెరుపు వేగంతో పరుగులు రాబట్టడంలో హార్దిక్ కింగ్. సఫారీలతో జరిగే కీలక పోరులో పాండ్యా భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది.

44
వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌కు సఫారీలు బలి కావాల్సిందే
Image Credit : ANI

వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌కు సఫారీలు బలి కావాల్సిందే

సౌతాఫ్రికా బ్యాటర్లకు వరుణ్ చక్రవర్తి ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారాడు. గణాంకాల ప్రకారం, టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే ప్రోటీస్ జట్టుపై 22 వికెట్లు పడగొట్టాడు. 

ఈ ప్రపంచకప్‌లోనూ వరుణ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. మిడిల్ ఓవర్లలో వరుణ్ వేసే మిస్టరీ బంతులను ఎదుర్కోవడం సౌతాఫ్రికా బ్యాటర్లకు పెను సవాలుగా మారనుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే భారత్ విజయం ఖాయం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs SA : 167+ స్ట్రైక్ రేట్ తో 448 రన్స్.. భారత్ ను భయపెడుతున్న సౌతాఫ్రికా స్టార్
Recommended image2
IPL 2026 : సంజూ వచ్చాడు.. ధోనీ వెళ్తున్నాడా? సీఎస్కే మాస్టర్ ప్లాన్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved