MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే

Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే

Team India New Captain: భారత స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు. ఆమె స్థానంలో స్మృతి మంధాన భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా నియామకమయ్యారు. టీ20ల్లో షెఫాలీ వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా ఉంటారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. టీ20ల్లో షెఫాలీ, వన్డేల్లో దీప్తికి వైస్ కెప్టెన్సీ
Image Credit : X/BCCIWomen

టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. టీ20ల్లో షెఫాలీ, వన్డేల్లో దీప్తికి వైస్ కెప్టెన్సీ

భారత మహిళల క్రికెట్‌లో ఒక కొత్త శకం మొదలైంది. టీమిండియా ఆల్‌ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకున్న కొన్ని గంటల్లోనే, కొత్త సారథిగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను బీసీసీఐ నియమించింది. మంగళవారం సాయంత్రం గౌహతిలోని ఏసిఏ (ACA) స్టేడియంలో మహిళల సెలక్షన్ కమిటీ సమావేశం అయింది.

జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్‌కు సుదీర్ఘకాలంగా డిప్యూటీగా వ్యవహరించిన 30 ఏళ్ల మంధాన, సారథ్య బాధ్యతలు చేపట్టడానికి సరైన ఎంపికగా నిలిచారు. ఇకపై హర్మన్‌ప్రీత్ కేవలం ప్లేయర్ గా జట్టులో కొనసాగుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వైస్ కెప్టెన్లుగా షెఫాలీ వర్మ, దీప్తి శర్మలకు ప్రమోషన్
Image Credit : X/BCCIWomen

వైస్ కెప్టెన్లుగా షెఫాలీ వర్మ, దీప్తి శర్మలకు ప్రమోషన్

స్మృతి మంధాన నాయకత్వంలోకి వచ్చిన వేళ వైస్ కెప్టెన్ల విషయంలో కూడా సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు, 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

ఈ నిర్ణయంతో టీమిండియా నాయకత్వ బృందంలో ఇద్దరు యంగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్లకు పెద్ద పీట వేసినట్లయింది. వీరిద్దరూ కొత్త కెప్టెన్ మంధానకు అండగా ఉంటూ జట్టును ముందుకు నడపనున్నారు.

36
కెప్టెన్సీకి ప్లస్ పాయింట్‌గా ఆర్సీబీ డబుల్ టైటిల్స్
Image Credit : X/BCCIWomen

కెప్టెన్సీకి ప్లస్ పాయింట్‌గా ఆర్సీబీ డబుల్ టైటిల్స్

స్మృతి మంధానకు అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా ఫ్రాంచైజ్ క్రికెట్‌లోనూ అద్భుతమైన కెప్టెన్సీ అనుభవం ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిపి తన లీడర్‌షిప్ స్కిల్స్ నిరూపించుకున్నారు.

గతంలోనూ ఆమె ఇండియా తరఫున 18 టీ20లు, 4 వన్డేలకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డుతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మృతి అగ్రస్థానంలో ఉన్నారు. ఇటీవల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించారు.

46
బీసీసీఐకి, హర్మన్‌ప్రీత్‌కు స్మృతి మంధాన ధన్యవాదాలు
Image Credit : X/BCCIWomen

బీసీసీఐకి, హర్మన్‌ప్రీత్‌కు స్మృతి మంధాన ధన్యవాదాలు

జట్టు బాధ్యతలు చేపట్టిన అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం చాలా ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు జట్టును నడిపించే అవకాశం రావడం నేను ఎప్పటికీ మరచిపోలేను. నాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు, సహచరులు, అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఇన్నేళ్లుగా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఆమె జట్టును ఎంతో అంకితభావంతో నడిపించారు. ఈ రోల్ వల్ల వచ్చే బాధ్యత నాకు తెలుసు, జట్టుతో కలిసి నేర్చుకుంటూ ఇండియన్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను" అని వెల్లడించారు.

56
జింబాబ్వే సిరీస్‌తో ప్రారంభం కానున్న కొత్త ప్రయాణం
Image Credit : X/BCCIWomen

జింబాబ్వే సిరీస్‌తో ప్రారంభం కానున్న కొత్త ప్రయాణం

భారత కొత్త నాయకత్వ బృందానికి మొదటి సవాలు స్వదేశంలో జింబాబ్వేతో జరగనున్న సిరీసే. మూడు టీ20ల సిరీస్ రాయ్‌పూర్‌లో అక్టోబర్ 16, 18, 20 తేదీల్లో జరగనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ వడోదరాలో అక్టోబర్ 23, 25, 28 తేదీలలో జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలోనే జరగనున్న తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ స్మృతి మంధానకు అత్యంత కీలకమైన బిగ్ అసైన్‌మెంట్ కానుంది.

66
జింబాబ్వే సిరీస్‌కు భారత జట్లు ఇవే
Image Credit : X@BCCIWomen

జింబాబ్వే సిరీస్‌కు భారత జట్లు ఇవే

టీ20 జట్టు:

స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), నికి ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, నందని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింటిమని కలితా, మిన్ను మణి.

వన్డే జట్టు:

స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలీ వర్మ, ప్రతిక రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, నందని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలి సత్‌ఘరే, రేణుకా ఠాకూర్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Recommended image2
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Recommended image3
Harmanpreet Kaur Net Worth: ఒక్కో సీజన్‌కు కోట్లలో సంపాదన.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్‌వర్త్ ఎంత?
Related Stories
Recommended image1
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image2
Harmanpreet Kaur Net Worth: ఒక్కో సీజన్‌కు కోట్లలో సంపాదన.. హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్‌వర్త్ ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved