అదృష్టం అంటే మన హైదరాబాద్ డీఎస్పీదే.. సిరాజ్ కోసం బుమ్రా సైడ్ ఇచ్చాడుగా..!
T20 World Cup: భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో నుంచి హర్షిత్ రాణా గాయం కారణంగా వైదొలిగాడు. అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే యూఎస్ఏతో జరగనున్న మొదటి మ్యాచ్‌తో సిరాజ్..

భారత జట్టులో కీలక మార్పులు
T20 వరల్డ్ కప్ 2026 సమయం రానే వచ్చింది. ఇవాళ యూఏఈ, భారత్ తలబడనున్నాయి. అటు భారత జట్టుకు హర్షిత్ రాణా దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.
హర్షిత్ రాణా ఔట్.. సిరాజ్ ఇన్
యువ పేసర్ హర్షిత్ రాణా గాయంతో టీ20 వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. అతడు వార్మప్ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. మోకాలి గాయం కారణంగా వైదొలిగాడు. అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులో వచ్చాడు. అలాగే వచ్చీ రాగానే తొలి మ్యాచ్.. బుమ్రా స్థానంలో ఆడనున్నాడు. సిరాజ్ పేస్ బౌలింగ్‌లో మరింత బలం జోడిస్తాడని.. జట్టుకు ఇది ప్లస్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
వాషింగ్టన్ సుందర్ అప్డేట్
ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స పొందుతున్నాడు. సైడ్-స్ట్రెయిన్ గాయంతో జట్టు నుంచి బయటకు వచ్చిన సుందర్.. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సుందర్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాతనే జట్టులో చేరతాడని స్పష్టం చేశాడు.
ఓపెనింగ్ జోడీ - అభిషేక్, ఇషాన్..
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఓ స్పష్టమైన సూచన ఇచ్చేశాడు. ఓపెనింగ్ జోడిగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నట్టు చెప్పకనే చెప్పాడు. సంజూ శాంసన్ ఇటీవల వార్మప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయకపోవడంతో బెంచ్‌కే పరిమితం కావచ్చు. అభిషేక్, ఇషాన్ ఓపెనింగ్ గట్టిగా ఉంటే.. జట్టు మిడిలార్డర్‌లో మంచిగా ఆడే ఛాన్స్ ఉంది
భారత స్క్వాడ్ పూర్తిగా ఇలా..
తాజా భారత జట్టు స్క్వాడ్ ఇలా.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్. ఈ 15 మంది ప్లేయర్స్.. మరోసారి టీమిండియాకు టీ20 ప్రపంచకప్ తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

