MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup : టీ20 వరల్డ్ కప్ మళ్లీ టీమిండియాదే .. అనడానికి ఈ 5 కారణాలు చాలవా..!

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ మళ్లీ టీమిండియాదే .. అనడానికి ఈ 5 కారణాలు చాలవా..!

ICC Mens T20 World Cup 2026 : ఈసారి కూడా  టీ20 వరల్డ్ కప్ టీమిండియాకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకుల అంచనా. కేవలం మాటలు కాదు… ఇందుకు 5 స్ట్రాంగ్ రీజన్స్ చెబుతున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 07 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 వరల్డ్ కప్ టీమిండియాదే..
Image Credit : INSTAGRAM/surya_14kumar

టీ20 వరల్డ్ కప్ టీమిండియాదే..

ICC T20 World Cup 2026 : ఐసిసి నిర్వహించే మెగా టోర్నీల్లో టీ20 వరల్డ్ కప్ ఒకటి... ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే దేశాలన్నీ ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ప్రస్తుతం భారత్ ఆతిథ్యం ఇస్తోంది... ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ముచ్చటగా మూడోసారి స్వదేశంలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ (ఫిబ్రవరి 7న) టీమిండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది.

క్రికెట్ విశ్లేషకుల ప్రకారం... ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మాట్  లో అదరగొడుతోంది... వరల్డ్ నెంబర్ 1 టీ20 టీమ్ ఇదే. ఇలాంటి దేశాన్ని స్వదేశంలో ఓడించడం చాలా కష్టం... కాబట్టి టీ20 ట్రోఫీ భారత్ దే అంటున్నారు. ఇలా టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఎందుకు గెలుస్తుందో మరో ఐదు కారణాలు చెబుతున్నారు... అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

26
సూర్యకుమార్ విశ్వరూపం చూస్తామా..?
Image Credit : X/LoyalSachinFan

సూర్యకుమార్ విశ్వరూపం చూస్తామా..?

భారత టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు ఇది మొదటి వరల్డ్ కప్. అలాగే టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ ఫస్ట్ వరల్డ్ కప్ ను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ ఇద్దరికీ ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకమైనది... ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. వీళ్లు జట్టు విజయం కోసం వందకు వందశాతం ప్రయత్నిస్తారు… ఓటమిని అస్సలు అంగీకరించరు.

ఇక సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్లు లేకుండా టీమిండియా ఆడుతున్న మొదటి ప్రపంచ కప్ ఇది. అయితే వీళ్ల రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు వీక్ అవుతుందని అందరూ భావించారు... కానీ ఊహకందని విధంగా యువ టీ20 టీం అద్భుతాలు చేస్తోంది... ఇప్పటికే వరుస విజయాలు సాధించింది. ఇదే దూకుడు టీ20 వరల్డ్ కప్ లోనూ కనబర్చి ట్రోఫీని దక్కించుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

Related image1
T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?
Related image2
T20 World Cup : 20 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో.. టాప్ 8 ఐకానిక్ మూమెంట్స్ ఇవే..!
36
పవర్‌ప్లేలో బ్యాటింగ్ ఆధిపత్యం
Image Credit : Getty

పవర్‌ప్లేలో బ్యాటింగ్ ఆధిపత్యం

టీమిండియా పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించనుంది... ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి బలమైన పునాది వేయడం ఖాయం. వీళ్ళిద్దరూ ఆడితే టీమిండియా గెలుపు ఖాయం.

46
మిడిల్ ఆర్డర్‌లో వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీ
Image Credit : stockPhoto

మిడిల్ ఆర్డర్‌లో వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీ

కోచ్ గంభీర్ మార్గదర్శకత్వంలో మిడిల్ ఆర్డర్ చాలా ఫ్లెక్సిబుల్‌గా మారింది. కెప్టెన్ సూర్యకుమార్, సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, దూకుడుగా ఆడే శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ అద్భుతాలు చేయగలరు. వీళ్లంతా తమదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్నవారే.

56
స్పిన్ వ్యూహం
Image Credit : ANI

స్పిన్ వ్యూహం

స్వదేశీ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించనున్నాయి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో కూడిన భారత స్పిన్ దళం చాలా బలంగా ఉంది. మిడిల్ ఓవర్లలో వీరే కీలకం కానున్నారు. వీళ్లలో ఏ ఒక్కరు రాణించినా విజయం టీమిండియాదే.

66
బలంగా ఫేస్ అటాక్
Image Credit : AFP

బలంగా ఫేస్ అటాక్

సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ పేస్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వీరిద్దరి బౌలింగ్ చాలా ముఖ్యం. గత ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్ష్ దీప్... ఈసారి కూడా ఇతడు స్వదేశీ పిచ్ లపై రెచ్చిపోతే టీమిండియా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. బుమ్రా, అర్ష్ దీప్ లు తమ ఫేస్ అటాక్ తో  ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
అదృష్టం అంటే మన హైదరాబాద్ డీఎస్పీదే.. సిరాజ్ కోసం బుమ్రా సైడ్ ఇచ్చాడుగా..!
Recommended image2
'మేము రోల్ మోడల్స్.. మమ్మల్ని చూసే అందరూ..' తొక్కేం కాదంటూ పాక్ కెప్టెన్‌పై ట్రోల్స్
Recommended image3
Team India : ముగిసిన రోహిత్-కోహ్లీ శకం? బీసీసీఐ సంచలనంతో స్టార్లకు షాక్ !
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?
Recommended image2
T20 World Cup : 20 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో.. టాప్ 8 ఐకానిక్ మూమెంట్స్ ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved