MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Suryakumar Yadav: నిమిషాల లెక్కన ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఆ భారత బ్యాటర్ విధ్వంసం.. ఎవరో తెలుసా?

Suryakumar Yadav: నిమిషాల లెక్కన ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఆ భారత బ్యాటర్ విధ్వంసం.. ఎవరో తెలుసా?

Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన అద్భుత ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కేవలం 63 నిమిషాల్లో సెంచరీ బాది హిస్టరీ క్రియేట్ చేసిన స్కై రికార్డు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్కై అరాచకం.. 63 నిమిషాల్లోనే సెంచరీ.. బౌలర్లు బెంబేలెత్తాల్సిందే
Image Credit : AFP

స్కై అరాచకం.. 63 నిమిషాల్లోనే సెంచరీ.. బౌలర్లు బెంబేలెత్తాల్సిందే

టీ20 క్రికెట్ అంటేనే బ్యాటంగ్ సునామీ.. మెరుపు దాడి. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లు చాలామంది ఉంటారు. కానీ, నిమిషాల లెక్కన చూస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన రికార్డు ఒక భారత బ్యాటర్ సొంతం. ఆ బ్యాటర్ మరెవరో కాదు, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఒకానొక మ్యాచ్‌లో అతను సృష్టించిన విధ్వంసానికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

25
63 నిమిషాల్లోనే సెంచరీ.. సూర్య సంచలనం
Image Credit : AFP

63 నిమిషాల్లోనే సెంచరీ.. సూర్య సంచలనం

క్రికెట్ చరిత్రలో బంతుల లెక్కన సెంచరీల గురించి మనం వినే ఉంటాం. కానీ, నిమిషాల లెక్కన చూస్తే సూర్యకుమార్ యాదవ్ (SKY) పేరు ప్రపంచ రికార్డుల్లో నిలిచిపోయింది. 20 నవంబర్ 2022న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సూర్య కేవలం 63 నిమిషాల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే నిమిషాల పరంగా అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆ రోజు సూర్య బ్యాటింగ్ చూస్తుంటే బౌలర్లు కనీసం కరుణించమని వేడుకుంటున్నారా అన్నట్లుగా సాగింది అతని జోరు.

Related Articles

Related image1
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Related image2
SRH : ఢిల్లీకి చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. 10 సిక్సర్లతో సెంచరీ విధ్వంసం
35
11 ఫోర్లు.. 7 సిక్సర్లు.. కివీస్ గడ్డపై విధ్వంసం
Image Credit : Getty

11 ఫోర్లు.. 7 సిక్సర్లు.. కివీస్ గడ్డపై విధ్వంసం

న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 217.65గా నమోదైంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సూర్య అంతకుముందు కెన్యా బ్యాటర్ అలెక్స్ ఒబాండా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలెక్స్ 2021లో నైజీరియాపై 68 నిమిషాల్లో సెంచరీ చేయగా, సూర్య దానిని 5 నిమిషాల ముందే పూర్తి చేసి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

45
భారత్ భారీ విజయం.. కివీస్ చిత్తు
Image Credit : ANI

భారత్ భారీ విజయం.. కివీస్ చిత్తు

సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కివీస్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూర్య ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది.

55
కెప్టెన్సీపై భిన్నాభిప్రాయాలు.. భవిష్యత్తు సవాలే
Image Credit : Getty

కెప్టెన్సీపై భిన్నాభిప్రాయాలు.. భవిష్యత్తు సవాలే

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, అతని భవిష్యత్తుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగే టీ20 వరల్డ్ కప్ నాటికి సూర్య వయసు 37 ఏళ్లకు చేరుకుంటుంది. అదే ఏడాది లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఒక వృద్ధుడైన నాయకుడి కంటే, జట్టును ముందుండి నడిపించే ఒక యువ కెప్టెన్ భారత్‌కు అవసరమనే చర్చ మొదలైంది. గత రికార్డులు ఎంత గొప్పగా ఉన్నా, ప్రస్తుత ఫామ్, వయసు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని కొందరు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : ఈ ఐపిఎల్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిందెవరు..? టాప్ 5 బౌలర్లు వీళ్లే
Recommended image2
Hardik Pandya Net Worth : పాండ్యా బ్రదర్స్‌లో ఎవరు రిచ్..? అన్ననా, తమ్ముడా?
Recommended image3
Abhishek Sharma : ఈ శర్మకు బౌలింగ్ చేయడం ఆ ప్లేయర్ల కర్మ..! 20 బంతుల్లో సెంచరీ ఏంటి సామీ..!!
Related Stories
Recommended image1
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Recommended image2
SRH : ఢిల్లీకి చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. 10 సిక్సర్లతో సెంచరీ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved