MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • SRH : ఢిల్లీకి చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. 10 సిక్సర్లతో సెంచరీ విధ్వంసం

SRH : ఢిల్లీకి చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. 10 సిక్సర్లతో సెంచరీ విధ్వంసం

SRH : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అభిషేక్ శర్మ 47 బంతుల్లో సెంచరీ బాదాడు. 10 సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును సమం చేస్తూ పలు ఘనతలు సాధించాడు. అభిషేక్ సునామీ బ్యాటింగ్ తో హైదరాబాద్ స్కోర్ 200 పరుగులు దాటింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2026, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అభిషేక్ శర్మ సునామీ.. సెంచరీతో దుమ్మురేపాడు
Image Credit : ANI

అభిషేక్ శర్మ సునామీ.. సెంచరీతో దుమ్మురేపాడు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 51 బంతుల్లోనే 115 పరుగులు సాధించి, తన సొంత గడ్డపై అభిమానులను మస్తు ట్రీట్ ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సొంత గడ్డపై సెంచరీతో అభిషేక్ గర్జన
Image Credit : ANI

సొంత గడ్డపై సెంచరీతో అభిషేక్ గర్జన

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. అయితే అభిషేక్ శర్మకు ఇది కలిసొచ్చింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్, ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అభిషేక్ తన రెండో ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల ముందే ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం గమనార్హం.

Related Articles

Related image1
Ayush Mhatre : సీఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సీజన్ మొత్తానికి స్టార్ ఓపెనర్ దూరం
Related image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
36
విరాట్ కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ
Image Credit : Getty

విరాట్ కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ

ఈ సెంచరీతో అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరసన నిలిచారు. ఇద్దరి పేరిట ఇప్పుడు 9 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రిస్ గేల్ (22), బాబర్ ఆజం (12) అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే టీ20 కెరీర్‌లో 350 సిక్సర్ల మైలురాయిని కూడా అభిషేక్ ఈ మ్యాచ్‌లోనే దాటేశారు.

46
ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ
Image Credit : Getty

ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలో ట్రావిస్ హెడ్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖేష్ కుమార్ వేసిన మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ఆయన, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి వంటి మేటి బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లు బాదారు. ముఖ్యంగా 11వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 22 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశారు.

56
కలిసొచ్చిన లైఫ్.. ఆ తర్వాత విధ్వంసం
Image Credit : ANI

కలిసొచ్చిన లైఫ్.. ఆ తర్వాత విధ్వంసం

ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మకు అదృష్టం కూడా తోడైంది. 8.1 ఓవర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చారు. అప్పుడు 49 పరుగుల వద్ద ఉన్న అభిషేక్, ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారారు. అలాగే 13.3 ఓవర్ వద్ద నితీష్ రాణా చేతుల్లో నుంచి బంతి జారిపోవడంతో మరోసారి బతికిపోయారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న ఆయన 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరును 183/2 కు చేర్చారు.

66
హైదరాబాద్ భారీ స్కోరు దిశగా..
Image Credit : ANI

హైదరాబాద్ భారీ స్కోరు దిశగా..

అభిషేక్ శర్మ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ట్రావిస్ హెడ్ 37 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 25 పరుగులకు రనౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. మ్యాచ్ ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు స్కోరు 200 దాటడం చూస్తుంటే, హైదరాబాద్ ఈ సీజన్‌లో మరో భారీ రికార్డు స్కోరు నమోదు చేసేలా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?
Recommended image2
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ టీమ్ లెజెండ్ సడన్ రిటైర్మెంట్.. అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
India T20 captain: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై బీసీసీఐ వేటు ! టీమిండియా కొత్త కెప్టెన్ ఇతనేనా?
Related Stories
Recommended image1
Ayush Mhatre : సీఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సీజన్ మొత్తానికి స్టార్ ఓపెనర్ దూరం
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved