- Home
- Sports
- పెళ్లికి ముందురోజే ప్రియురాలితో ఏకాంతంగా పలాష్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈ మహిళా క్రికెటరే..?
పెళ్లికి ముందురోజే ప్రియురాలితో ఏకాంతంగా పలాష్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈ మహిళా క్రికెటరే..?
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిందా..? శాశ్వతంగా క్యాన్సిల్ అయ్యిందా..? పెళ్లికి ముందురోజు అసలు ఏం జరిగింది..? ఈ విషయాల గురించి ఓ యువతి రెడ్డిట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

స్మృతి-పలాష్ పెళ్లి వ్యవహారంపై ఏం జరుగుతోంది?
Smriti Mandhana Wedding : వరల్డ్ కప్ 2025 విజయం తర్వాత ఎంతో ఆనందంగా పెళ్లికి సిద్దమయ్యింది టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన. తాను ఇష్టపడిన ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ పలాష్ ముచ్చల్ ను వరల్డ్ కప్ గెలిచిన మైదానంలోనే అందరికీ పరిచయం చేసింది. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళికి కూడా సిద్దమయ్యింది. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ మరికొద్దిగంటల్లో పెళ్లి జరుగుతుంది... స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఒక్కటయిపోతారు అనగా ఊహించని ఘటనలు జరిగాయి. పెళ్లి వాయిదా పడింది... అసలు ఎందుకిలా జరిగిందో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
స్మృతిపెళ్లి వాయిదా పడిందా.. ఆగిపోయిందా?
స్మృతిపెళ్లి వాయిదా పడిందా లేక శాశ్వతంగా ఆగిపోయిందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడంలేదు. పెళ్లి రోజు స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అందుకే పెళ్లి వాయిదా పడిందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రిలో చేరడం అనుమానాలకు దారితీసింది.
ఈ మధ్యలో పలాష్ ముచ్చల్ గురించి రోజుకో కథ పుట్టుకొస్తోంది. పలాష్, స్మృతిని మోసం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతోనే పెళ్లి రోజు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పెళ్లికి ముందు రోజు పలాష్ ముచ్చల్ తన మాజీ ప్రియురాలితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది స్మృతి మంధాన స్నేహితురాలు, టీమిండియా మహిళ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ అట...ఈ ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
స్మృతి, పలాష్ పెళ్లి వ్యవహారంపై రెడ్డిట్ పోస్ట్ వైరల్
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి, పలాష్ పెళ్ళి వాయిదా పడలేదు... శాశ్వతంగా ఆగిపోయిందని ఓ రెడ్డిట్ యూజర్ తెలిపారు. ఇందుకు కారణమేంటో కూడా తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యింది. ఆ రెడ్డిట్ పోస్ట్ యధావిధిగా ఇక్కడ అందిస్తున్నాం.
నా మాజీ సిచ్యుయేషన్‌షిప్ (రిలేషన్‌షిప్‌లో మరో రకం) ఒక ప్రముఖ పీఆర్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. స్మృతి మంధాన గురించిన రూమర్ల గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని నేను అతన్ని సంప్రదించాను. నేను ఇక్కడ చెబుతున్నది కట్టుకథ కాదు. ఆ పీఆర్ టీమ్ వాళ్ల వర్క్ వాట్సాప్ గ్రూప్‌లో దీని గురించి చర్చించుకుంటున్నారు. నా మాజీ ప్రియుడు అవే చాట్‌లను నాకు పంపి, స్మృతి మంధాన పెళ్లిలో జరిగిన వివరాలను చెప్పాడు.
విషయం ఏంటంటే, స్మృతిని పలాష్ నిజంగానే మోసం చేశాడు. కానీ ఇప్పుడు తాను ఆసుపత్రిలో చేరిన వార్తను ఎక్కువగా వైరల్ చేయడానికి పీఆర్ ఏజెన్సీలకు డబ్బు ఇస్తున్నాడు. ఆసుపత్రికి సంబంధించిన వార్తల బాధ్యత కూడా అతనే చూసుకుంటున్నాడు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీమ్ పేజీలకు కూడా డబ్బు ఇస్తున్నాడు. ఇవేవీ ఇప్పుడు పనిచేయడం లేదు.
పలాష్ ప్రియురాలు ఎవరో తెలుసా?
ఇదంతటికీ అసలు కారణం నందికా ద్వివేది అనే అమ్మాయి. పెళ్లి వేడుకలన్నింటిలోనూ పలాష్ పక్కనే ఈమె ఉంది. మెహందీతో సహా అన్ని కార్యక్రమాలకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి బాస్కో టీమ్ ఈమెను పలాష్ కు కేటాయించగా, గుల్నాజ్ అనే అమ్మాయి స్మృతి మంధానకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే స్మృతి ఆప్తమిత్రురాలు, టీమిండియా క్రికెట్ ప్లేయర్ అయిన శ్రేయాంక పాటిల్ పెళ్లికి ముందు రోజు పలాష్ ను , ఆ అమ్మాయిని ఏకాంతంగా ఉన్నప్పుడు పట్టుకుంది. తర్వాత స్మృతి ముందే ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. స్మృతి సోదరుడు పలాష్ పై దాడి చేయడంతో అతనికి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆమె తండ్రికి ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు.ఇదంతా జరిగే సమయానికి చాలామంది అతిథులు నిద్రపోయారు. ఉదయాన్నే అతిథులకు స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి రద్దయిందని చెప్పారు. కానీ స్మృతి మాత్రం ఆ సమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూనే ఉంది.
అన్నింటికీ కారణమైన ఆ డ్యాన్స్ డైరెక్టర్ అక్కడి నుంచి పారిపోగా, ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ తన సోదరుడు పలాష్ ను రాత్రికి రాత్రే ముంబైకి తీసుకెళ్లింది. తాను చేసిన తప్పుడుపని నుండి తప్పించుకోవడానికి అసిడిటీ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు పలాష్ డ్రామా సృష్టించారు.
స్మృతికి అండగా సహచర క్రికెటర్లు
ఈ సమయంలో స్మృతి జీవితం చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి పడిన నరకయాతన ఎవరికీ వద్దు. కానీ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఆమె తండ్రి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక క్రికెట్ స్నేహితులు ఆమెతోనే ఉన్నారు. ఏ దశలోనూ ఆమెను వదిలిపెట్టలేదు. అండగా నిలబడ్డారు.
ఇప్పుడు నేను ఎంత నిరాశలో ఉన్నానో కూడా చెబుతాను. నా మాజీ లవర్ పరిస్థితి కూడా ఇదే. అతను నన్ను మోసం చేశాడు. అతను మరో అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అంతేకాదు ఈ పోస్ట్ పెట్టినందుకు అతను నాకు లీగల్ నోటీసు పంపవచ్చా అనే భయం కూడా ఉంది. నేను దీన్ని డిలీట్ చేయాలా? దయచేసి నాకు చెప్పండి.

