- Home
- Entertainment
- Smriti Mandhana: స్మృతి మంధాన తండ్రికే కాదు, కాబోయే భర్తకు కూడా అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిన నవవరుడు
Smriti Mandhana: స్మృతి మంధాన తండ్రికే కాదు, కాబోయే భర్తకు కూడా అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిన నవవరుడు
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. ఆమె తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు కాబోయే భర్త కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

ఆసుపత్రిలో కాబోయే భర్త
భారత క్రికెట్ ప్లేయర్స్ స్మృతి మంధాన పెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆమె సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ను ప్రేమ వివాహం చేసుకునేందుకు పెద్దల అంగీకారాన్ని పొందింది. నవంబర్ 23న పెళ్లి జరగాల్సి ఉండగా వివాహానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో వివాహాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం స్మృతి మంధాన కాబోయే భర్త పలాష్ కు కూడా అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. పలాష్ కు వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే పలాష్ కు వచ్చిన సమస్య చిన్నదే, చికిత్స తీసుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది.
స్మృతి తండ్రికి గుండెపోటు
ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఆరోజు తెల్లవారుజామునే స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చింది. ఉదయం అల్పాహారం తీసుకుంటున్నప్పుడు అతని ఆరోగ్యం క్షీణించింది. దాంతో వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. స్మృతికి తండ్రి అంటే చాలా ఇష్టం. ఆమె పెద్ద స్టార్ క్రికెటర్ అయ్యేందుకు తండ్రి ఎంతో కష్టపడ్డారు. అందుకే తండ్రి కోసం తన వివాహాన్ని స్మృతి మంధాన వాయిదా వేసింది. తండ్రి ఆరోగ్యం బాగుంటేనే వివాహం చేసుకుంటానని ఆమె చెప్పింది.
స్మృతి మంధాన ఆస్తులు
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ప్రేమ కథ 2019లో ప్రారంభమైనట్టు ఆ జంట చెబుతోంది. ఇప్పటివరకు వారు నిజమైన ప్రేమలోనే మునిగితేలారు. త్వరలో స్మృతి మంధాన.. ఇండోర్ కోడలు అవ్వబోతోంది. ఇక వీరి పెళ్లి మహారాష్ట్రలోని సాంగ్లీలో ఏర్పాటు చేశారు. కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. స్మృతి సంవత్సరానికి 50 లక్షల రూపాయల విలువైన గ్రేడ్ ఏ కాంట్రాక్టును బీసీసీఐ నుంచి పొందింది. ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షల రూపాయలు, వన్డేకు 6 లక్షల రూపాయలు ఆమె చేస్తుంది. ఇక ఆమె నికర విలువ 34 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా. ఇక పలాష్ ముచ్చల్ 1995లో ఇండోర్లో జన్మించాడు. ముసాఫిర్, తూ హీ హై ఆషికీ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు అలాగే టీవీ కార్యక్రమాలకు కూడా సంగీతాన్ని కంపోజ్ చేశారు. ఇతని ఆస్తి 20 కోట్ల రూపాయల నుండి 41 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

