MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • దత్తపుత్రుడని కెప్టెన్‌ను చేశారు.. కట్ చేస్తే.. టీమిండియాను నట్టేట ముంచేశాడు..

దత్తపుత్రుడని కెప్టెన్‌ను చేశారు.. కట్ చేస్తే.. టీమిండియాను నట్టేట ముంచేశాడు..

Team India: భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 22న ప్రారంభం కానున్న రెండో టెస్టుకు శుభ్ మాన్ గిల్ లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో మెడనొప్పితో వైదొలిగిన గిల్, గువాహటి టెస్టుకు ఆడతాడా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 

2 Min read
Author : Pavithra D | ANI
Published : Nov 19 2025, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండో టెస్టుకు కెప్టెన్ దూరం.?
Image Credit : BCCI\Twitter

రెండో టెస్టుకు కెప్టెన్ దూరం.?

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గువాహటిలోని బర్సపరా స్టేడియంలో ప్రారంభం కానుంది. కోల్ కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాకు ఈ గువాహటి టెస్టు అత్యంత కీలకంగా మారింది. అయితే, కీలక బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ లభ్యతపై నెలకొన్న సందిగ్ధత భారత జట్టును కలవరపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మరి కెప్టెన్ ఎవరు.?
Image Credit : BCCI\Twitter

మరి కెప్టెన్ ఎవరు.?

తొలి టెస్టులో మెడనొప్పి కారణంగా శుభ్ మన్ గిల్ ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్టుకు అతను ఆడతాడా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ గువాహటికి బయలుదేరినట్లు సమాచారం. అయినప్పటికీ, అతను మ్యాచ్ లో పాల్గొంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

35
గిల్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.?
Image Credit : BCCI\Twitter

గిల్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.?

ఒకవేళ శుభ్ మాన్ గిల్ రెండో టెస్టుకు దూరమైతే, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ సెలెక్టర్లు ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలుపు అనివార్యం కాగా, గిల్ లభ్యతపై తుది నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో మాజీ క్రికెటర్లు పలు సలహాలు ఇస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

45
అందరూ లెఫ్ట్ హ్యండర్లు
Image Credit : BCCI\Twitter

అందరూ లెఫ్ట్ హ్యండర్లు

కానీ బీసీసీఐ రాడార్‌లో గైక్వాడ్ లేడు. గిల్ ఒకవేళ రెండో టెస్టుకు దూరమైతే.. సుదర్శన్ లేదా పడిక్కల్‌ను అతడి స్థానంలో భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటే.. ఇప్పటికే ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు జట్టులో ఉంటే.. ఇక ఇతడితో ఏడుగురు అవుతారని.. అది జట్టుకు లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చిపెట్టినట్టుగా ఉంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

55
కచ్చితంగా గెలిచి తీరాలి.?
Image Credit : X/BCCI

కచ్చితంగా గెలిచి తీరాలి.?

మొదటి టెస్ట్ ఓటమితో కచ్చితంగా రెండు మ్యాచ్‌లో టీమిండియా జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐదుగురు స్పిన్నర్లు ఉన్నా మొదటి టెస్ట్ ఓడిపోయిన భారత్.. ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్లు కీలకం కానుండటంతో.. ఈ మ్యాచ్ లో భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
India vs Australia: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. ఆ ఇద్ద‌రి రాక‌తో పెరిగిన క్యూరియాసిటీ
Recommended image2
Team India: టీమిండియాకు 'హరీస్ రౌఫ్' దొరికేశాడ్రోయ్.. అయ్యో.! గంభీర్ శిష్యుడిని ఏకీపారేస్తున్నారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved