MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • ఇంటర్నల్ బ్లీడింగ్‌ తో సీరియస్.. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ కండిషన్‎పై బిగ్ అప్డేట్

ఇంటర్నల్ బ్లీడింగ్‌ తో సీరియస్.. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ కండిషన్‎పై బిగ్ అప్డేట్

Shreyas Iyer Injury Update: ఇంటర్నల్ బ్లీడింగ్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వరకు కఠిన పర్యవేక్షణ ఉంటుందనీ, అయ్యర్ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపడానికి బీసీసీఐ చర్యలు తీసుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శ్రేయాస్ అయ్యర్ కు సీరియస్
Image Credit : Getty

శ్రేయాస్ అయ్యర్ కు సీరియస్

టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్టోబర్ 25న జరిగిన మూడో వన్డే సమయంలో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ ను అందుకునే సమయంలో పక్కటెములకు గాయం కావడంతో తీవ్ర నొప్పితో గ్రౌండ్‎లోనే అల్లాడిపోయాడు. మొదట ఫీల్డులోనే చికిత్స ఇచ్చారు. 

తరువాత పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‎లో అయ్యర్ ప్లీహానికి గాయం అయినట్టు నిర్ధారించారు. ఆ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభమై ప్రమాద స్థాయి పెరిగింది. డాక్టర్లు వెంటనే అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స మొదలుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శ్రేయాస్ అయ్యర్ గాయం పై బీసీసీఐ అధికారిక అప్‌డేట్
Image Credit : @BCCI/X

శ్రేయాస్ అయ్యర్ గాయం పై బీసీసీఐ అధికారిక అప్‌డేట్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శి దేవజీత్ సైకియా శ్రేయాస్ అయ్యర్ గాయం పై అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “మూడో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో శ్రేయాస్ అయ్యర్‌ పక్కటెములకు గాయం అయింది. స్ప్లీన్‌కు గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏర్పడింది. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. సిడ్నీతో పాటు భారత్‌లోని నిపుణుల సలహాలతో పర్యవేక్షణ కొనసాగుతోంది” అని తెలిపారు. అయన త్వరితగతిన కోలుకుంటున్నారని అన్నారు. టీమ్ డాక్టర్లు ఆయన్ను నిత్యం పరిశీలిస్తూ నివేదికలు పంపిస్తున్నారు.

36
ఐసీయూలో గట్టి పర్యవేక్షణ
Image Credit : Getty

ఐసీయూలో గట్టి పర్యవేక్షణ

పీటీఐ సమాచారం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్‌కు గత రెండు రోజులుగా ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. 2-7 రోజులు డాక్టర్లు కఠిన పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం. నివేదికలు వెలువడిన వెంటనే ఆసుపత్రిలో భద్రతా చర్యలు చేపట్టారు.

స్ప్లీన్ గాయం ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావించారు. అదృష్టవశాత్తు సమయానికి చికిత్స లభించడంతో పరిస్థితి ప్రస్తుతానికి స్థిరంగా ఉంది.

46
శ్రేయాస్ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ సన్నాహాలు
Image Credit : instagram

శ్రేయాస్ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ సన్నాహాలు

శ్రేయాస్ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన తండ్రి సంతోష్ అయ్యర్, తల్లి రోహిణి అయ్యర్‌ను త్వరగా ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ సమాచారం. వారి రాక సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒకరిని వెంటనే ఆయన దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

56
శ్రేయాస్ అయ్యర్‌కు గాయం ఎలా అయింది?
Image Credit : Getty

శ్రేయాస్ అయ్యర్‌కు గాయం ఎలా అయింది?

మూడో వన్డేలో 34వ ఓవర్‌లో ఎలెక్స్ క్యారీ క్యాచ్ కోసం శ్రేయాస్ అయ్యర్‌ వేగంగా పరుగు తీశారు. గాల్లోకి దూకుతూ పట్టిన ఆ క్యాచ్ టీం ఇండియాకు వికెట్ అందించింది. అయితే అదే సమయంలో ఆయన నేలపై పడటంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లలాడారు. వెంటనే గ్రౌండ్‌ను వీడి చికిత్సకు వెళ్ళాల్సి వచ్చింది.

ఆ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌లు కోల్పోయిన భారత్ ఈ విజయంతో గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది. టి20 జట్టులో శ్రేయాస్ అయ్యర్‌ లేకపోవడం వల్ల జట్టు కూర్పుపై తక్షణ ప్రభావం ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

66
గతంలోనూ శ్రేయాస్ అయ్యర్‌కు గాయాలు
Image Credit : x

గతంలోనూ శ్రేయాస్ అయ్యర్‌కు గాయాలు

శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా భుజం, లోయర్ బ్యాక్ గాయాలతో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నారు. ఈసారి స్ప్లీన్ గాయం చికిత్స పూర్తయ్యే వరకు సిడ్నీలో మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీసీసీఐ, వైద్య బృందం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
విమర్శలకు బ్యాట్ తోనే రోహిత్, కోహ్లీ సమాధానం.. ఎవర్రా మీరంతా !
Recommended image2
ఇదెక్కడి హిట్టింగ్ సామీ.. 9 బంతుల్లో 8 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved