MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విమర్శలకు బ్యాట్ తోనే రోహిత్, కోహ్లీ సమాధానం.. ఎవర్రా మీరంతా !

విమర్శలకు బ్యాట్ తోనే రోహిత్, కోహ్లీ సమాధానం.. ఎవర్రా మీరంతా !

Rohit and Virat : ఆస్ట్రేలియాలో చివరి వన్డేలో రోహిత్ శర్మ 121* పరుగులు, విరాట్ కోహ్లీ 74* పరుగుల సూపర్ నాక్ ఆడటంతో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. సైలెంట్ గా ఉంటూనే కోహ్లీ, రోహిత్ లు తమపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 26 2025, 09:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్ వైట్‌వాష్‌ను అడ్డుకున్న కోహ్లీ, రోహిత్
Image Credit : Getty

భారత్ వైట్‌వాష్‌ను అడ్డుకున్న కోహ్లీ, రోహిత్

ఆస్ట్రేలియా vs భారత్ మూడో వన్డేలో సిడ్నీలో టీమిండియా 9 వికెట్లతో విక్టరీ కొట్టింది. సిరీస్‌ను 2-1 తేడాతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత మూడో వన్డేలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో విజయాన్ని సాధించారు. మొత్తం 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలోనే చేధించింది. టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దుమ్మురేపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిడ్నీలో అదరగొట్టిన రోహిత్, విరాట్
Image Credit : X/SunRisers

సిడ్నీలో అదరగొట్టిన రోహిత్, విరాట్

రోహిత్ శర్మ తన 33వ వన్డే సెంచరీని నమోదు చేసి 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 74 నాటౌట్‌ పరుగులతో అదరగొట్టాడు. తమపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం ఇచ్చారు. అంతకుముందు, ఈ ఇద్దరు స్టార్ల పై విమర్శలు చేసిన వారిని ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకుంటున్నారు. ఎవర్రా మీరంతా అంటూ విమర్శకులపై కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

కాగా, సిడ్నీ స్టేడియంలో “Thank You Rohit”, “Thank You Virat”, “Don’t Go Ro-Ko” పోస్టర్లు నిండిపోయాయి. ఈ జంట ఆస్ట్రేలియాలో చివరి మ్యాచ్ కావొచ్చు అన్న అనుమానాల నేపథ్యంలో అభిమానుల స్పందనలు ప్రత్యేకంగా నిలిచాయి.

మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. “మళ్లీ వస్తామో లేదో తెలీదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతి క్షణం మాకు ఎంతో ఆనంద క్షణాలను అందించాయి” అని పేర్కొన్నాడు. కోహ్లీ కూడా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. “ఇక్కడ ఆడడం అంటే మాకు ప్రత్యేకం. ఇక్కడ మాకు మీరు ఇచ్చిన ప్రేమకు ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు.

35
8 నెలల తర్వాత సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ
Image Credit : ANI

8 నెలల తర్వాత సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ

పెర్త్, అడిలైడ్‌లో కొంచెం బలహీనంగా కనిపించిన రోహిత్ శర్మ సిడ్నీలో పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. 8 నెలల తర్వాత సెంచరీ కొట్టాడు. తన సెంచరీ నాక్ లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. తన ఫిట్‌నెస్‌తో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్‌లో కోహ్లీతో పోటీ పడుతూ పరుగెత్తాడు. 11 కేజీలు తగ్గిన తర్వాత అతని శైలిలో గణనీయమైన మార్పులు కనిపించాయి. అతని పుల్ షాట్, స్వీప్ షాట్లు ప్రేక్షకులను అలరించాయి.

45
ఒత్తిడిని అధిగమించిన విరాట్
Image Credit : Getty

ఒత్తిడిని అధిగమించిన విరాట్

మొదటి రెండు మ్యాచ్‌ల్లో డక్ అయిన విరాట్ సిడ్నీలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత్ విజయాన్ని అందించడానికి అజేయ నాక్ ఆడాడు. తన హాఫ్ సెంచరీ నాక్ లో 7 బౌండరీలు బాదాడు. బిగ్ స్క్వేర్ బౌండరీలను ఉపయోగించుకుని పరుగులు రాబట్టాడు. “డక్స్ తీరాయి. క్రికెట్ ఎప్పటికీ నేర్పుతూనే ఉంటుంది” అని కోహ్లీ నవ్వుతూ మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నాడు. మ్యాచ్ ముగిసే వరకు ఇద్దరూ నాటౌట్‌గా నిలిచి, ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు.

55
2027 వరల్డ్ కప్ ప్రశ్నకు సమాధానం ఇంకా మిస్టరీనే
Image Credit : X/BCCI

2027 వరల్డ్ కప్ ప్రశ్నకు సమాధానం ఇంకా మిస్టరీనే

మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్ వరుస పెట్టి 2027 వరల్డ్ కప్ గురించి ప్రశ్నలు ఆడిగారు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇద్దరూ వయసులు అప్పటికి వరుసగా 40, 39 ఏళ్లు అవుతాయి. దీంతో అప్పటివరకు వీరు తమ ఫిట్ నెస్, ఫామ్ ను కాపాడుకోవడం కష్టమే అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే భారత్ వన్డే షెడ్యూల్ లో పెద్దగా మ్యాచ్ లు లేవు. భారత్ తర్వాతి వన్డే సిరీస్‌ను వచ్చే నెల దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అందులో మాత్రం ఈ ఇద్దరూ అందుబాటులో ఉంటారని అంచనాలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
రోహిత్ శర్మ 50వ సెంచరీ .. సెహ్వాగ్‌ రికార్డు బ్రేక్
Recommended image2
సచిన్ కు షాకిచ్చిన విరాట్ కోహ్లీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved