MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • ధోనికే థ్యాంక్స్.. నా ఆటను మార్చింది అతడే.. దూబే సంచలన వ్యాఖ్యలు

ధోనికే థ్యాంక్స్.. నా ఆటను మార్చింది అతడే.. దూబే సంచలన వ్యాఖ్యలు

Shivam Dube: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించారు. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 20 2026, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు
Image Credit : X@BCCI

బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిక్సర్లు కొట్టడం అంటే తనకు చాలా ఇష్టమని, అయితే గుడ్డిగా ఏ మాత్రం ఆడనని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులకు తగ్గట్టు ఆడటానికి తాను నిరంతరం ప్రయత్నిస్తానని తెలిపారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆల్‌రౌండర్ ప్రదర్శనతో
Image Credit : Getty

ఆల్‌రౌండర్ ప్రదర్శనతో

ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించారు. సహచర బ్యాటర్లంతా ఇబ్బంది పడిన వికెట్‌పై శివమ్ దూబే అలవోకగా సిక్సర్లు బాదారు. 6 సిక్సర్లతో పాటు 4 ఫోర్లు, మొత్తం 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. తన బ్యాటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ, కష్టమైన వికెట్లపై బ్యాటింగ్ చేయడం తనకు ఇష్టమని, అలాంటి పరిస్థితుల్లోనే తన ఆటను ఆస్వాదిస్తానని పేర్కొన్నారు.

Related Articles

Related image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
35
మంచి బంతులు వేస్తున్నప్పుడు
Image Credit : Getty

మంచి బంతులు వేస్తున్నప్పుడు

బౌలర్లు మంచి బంతులు వేస్తున్నప్పుడు కూడా బౌండరీలు సాధించేందుకు తాను సిద్ధంగా ఉంటానని దూబే వెల్లడించారు. బౌలర్లు తనను బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని, యార్కర్లు, లెంత్ బాల్స్ వేయకుండా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ వేస్తారని తనకు తెలుసని, అందుకే వాటికోసం తాను సిద్ధంగా ఉండి వేచి చూశానని అన్నారు.

45
రన్ రేట్‌ను వేగంగా పెంచాలని..
Image Credit : Getty

రన్ రేట్‌ను వేగంగా పెంచాలని..

మిడిల్ ఓవర్లలో తాను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రన్ రేట్‌ను వేగంగా పెంచాలని కెప్టెన్, కోచ్ తనకు చెప్పారని, అయితే అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని వివరించారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చినప్పుడు వేగంగా ఆడే పరిస్థితి లేదని, కానీ ఒకానొక సమయంలో మాత్రం తాను చెలరేగి ఆడాల్సిన సమయం వచ్చిందని తనకు అనిపించిందని తెలిపారు.

55
బౌలింగ్ పై కష్టపడుతున్నా..
Image Credit : Getty

బౌలింగ్ పై కష్టపడుతున్నా..

తన బౌలింగ్ పై కూడా చాలా కష్టపడుతున్నానని, అందుకు తగ్గట్లుగా ఫలితాలు వస్తున్నాయని దూబే వెల్లడించారు. ఇది టీ20 మ్యాచ్ అని, కొన్నిసార్లు పరుగులు ఇచ్చుకున్నా వికెట్లు వస్తాయని శివమ్ దూబే నమ్మకంగా తెలిపారు. ఆదివారం సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలబడనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved