పనికిరాదని పక్కనపెట్టేశారు.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వరల్డ్‌కప్ అందించింది.. ఎవరో తెలుసా
Shafali Verma: వరల్డ్ కప్ ప్రణాళికలో లేని షెఫాలీ వర్మ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో అద్భుతాలు సృష్టించింది. సెమీస్‌లో విఫలమైనా, ఫైనల్‌లో 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు తీసి టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టింది.

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
వరల్డ్ కప్ ప్రణాళికలో అసలు లేని షెఫాలీ వర్మ.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా టీమిండియాలోకి వచ్చి దేశం మొత్తం గర్వించేలా చేసింది. ఫామ్‌లో లేదని గత సంవత్సరం వైట్ బాల్ ఫార్మాట్ నుంచి పక్కనబెట్టిన డాషింగ్ ఓపెనర్‌ను సెలెక్టర్లు మొదట పట్టించుకోలేదు. షెఫాలీ కూడా వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లను ఇంట్లో నుంచే చూసింది. అయితే, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ గాయపడటంతో ఆమె అదృష్టం మారిపోయింది. ప్రతీక స్థానంలో డేరింగ్ బ్యాటర్ షెఫాలీని తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
షెఫాలీకి తుది జట్టులో చోటు
రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన షెఫాలీకి తుది జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనే సందేహాలు రేకెత్తాయి. సెమీస్‌లో ఆమెకు అవకాశం లభించినా, కేవలం 10 పరుగులే చేసి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. అయితే, ఫైనల్‌లో షెఫాలీ తన టైమ్ కోసం వేచి చూసింది. టాస్ ఓడినప్పటికీ, టీమిండియా ఇన్నింగ్స్‌ను టాప్ గేర్‌లో ముందుకు తీసుకెళ్లింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే బౌండరీలు బాదింది. 87 పరుగులతో తనదైన మార్క్ చూపించింది.
షెఫాలీ వర్మ మ్యాజిక్
బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ షెఫాలీ వర్మ మ్యాజిక్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఫైనల్ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే లూస్ వికెట్ తీసింది. ఆ తర్వాత మిరాజానె కాప్‌ను పెవిలియన్ పంపింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌లా కాకుండా ప్రొఫెషనల్ స్పిన్నర్‌లాగే షెఫాలీ మెరుపులు మెరిపించింది. ఒకటి రెండు ఓవర్లకే పరిమితం చేయాలనుకున్న హర్మన్, ఆ తర్వాత షెఫాలీతోనే ఏడు ఓవర్లు బౌలింగ్ చేయించింది.
వరల్డ్ కప్ టీమ్‌లో లేని షెఫాలీ
వారం క్రితం వరల్డ్ కప్ టీమ్‌లో లేని షెఫాలీ, ఇప్పుడు ఏకంగా భారత్‌కు వరల్డ్ కప్‌నే అందించింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫైనల్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించేలా తనదైన సంతకం చేసింది. అందుకే షెఫాలీ అంటే ఇప్పుడు ఛాంపియన్ ప్లేయర్. హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన షెఫాలీకి చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి. 10 సంవత్సరాల వయసులోనే ఆమె టాలెంట్ అందరికీ తెలిసింది.
బాయ్స్ టోర్నీలో బరిలోకి
సోదరుడు జ్వరంతో అండర్-12 టోర్నీ నుంచి తప్పుకోవడంతో, బాయ్స్ టోర్నీలో బరిలో దిగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులను అందుకుంది. అబ్బాయిల క్రికెట్ ఆడినప్పుడు, హెయిర్ స్టైల్ బాయ్స్‌లా ఉండటంతో ఎవరూ గుర్తించేవాళ్లు కాదు. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చిన ఆమె, టీనేజ్‌లోనే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఓపెనర్‌గా స్థిరపడింది. 2023లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోనూ షెఫాలీ సభ్యురాలే. అయితే, నిలకడగా రాణించకపోవడంతో సీనియర్ జట్టుకు దూరమైంది. డొమెస్టిక్ టోర్నీలో రాణించి మళ్లీ టీ20లో అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ప్రతీక గాయంతో లభించిన అవకాశాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శనతో సద్వినియోగం చేసుకుంది. ఈ యువ ప్లేయర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్‌గా మారిపోయింది.

