MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !

IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !

Rajasthan Royals: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026 ముందు రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు జ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం. సంజూ శాంసన్ తో పాటు మరో ఐదుగురు ఆటగాళ్లు రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2025, 10:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న
Image Credit : ANI

IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న

ఐపీఎల్ 2025 సీజన్‌ రాజస్థాన్ రాయల్స్‌ (RR)కి పూర్తిగా నిరాశ కలిగించేలా ముగిసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన జట్టు.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ ఫలితంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ క్ర‌మంలోనే గ‌త సీజ‌న్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను దృష్టిలో ఉంచుకుని పెద్ద మార్పుల‌కు జ‌ట్టు సిద్ధ‌మ‌వుతోంది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకునే అవ‌కాశాలు ఉన్నాయి. వారిలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు గమనిస్తే..

DID YOU
KNOW
?
ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయ‌ల్స్
రాజస్థాన్ రాయల్స్ 2008లో తమ ఏకైక ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. కెప్టెన్ షేన్ వార్న్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. యూసుఫ్ పఠాన్ అద్భుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంజూ శాంసన్ రాజ‌స్థాన్ ను వీడ‌తారా?
Image Credit : Twitter

సంజూ శాంసన్ రాజ‌స్థాన్ ను వీడ‌తారా?

కెప్టెన్‌ సంజూ శాంసన్ జ‌ట్టును వీడ‌టం గురించి ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌కి తన నిర్ణయాన్ని తెలియజేసింద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ESPN క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్‌ ప్రకారం.. ఐపీఎల్ (IPL) 2025 ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తనను వేలానికి ముందు రిలీజ్‌ చేయాలని లేదా ట్రేడ్‌ చేయాలని కోరారు. రాజస్థాన్‌తో ఆయన సంబంధాలు గతంలా లేవని సమాచారం. అందుకే జ‌ట్టును వీడాలని సంజూ శాంసన్ చూస్తున్నార‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది.

36
తుషార్ దేశ్‌పాండే
Image Credit : ANI

తుషార్ దేశ్‌పాండే

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 6.50 కోట్లకు తుషార్ దేశ్‌పాండేను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్‌. అయితే, ఆయన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీశారు. ఎకానమీ రేట్‌ 10.62గా ఉండటం బౌలింగ్‌ విభాగంలో ఆందోళన కలిగించింది. అత‌ను త‌న ఐపీఎల్ కెరీర్‌లో 46 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు మాత్రమే సాధించారు.

46
షిమ్రాన్ హెట్మెయర్
Image Credit : PTI

షిమ్రాన్ హెట్మెయర్

ఐపీఎల్ 2025కు ముందు రూ. 11 కోట్లకు రిటైన్‌ చేసిన షిమ్రాన్ హెట్మెయర్ కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలమయ్యారు. 14 మ్యాచ్‌ల్లో 239 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 21.72, స్ట్రైక్ రేట్‌ 145.73తో త‌న బ్యాటింగ్ ను కొన‌సాగించాడు. పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న ఈ ప్లేయ‌ర్ నుంచి దానికి త‌గ్గ‌ట్టు ప్రదర్శన లేక‌పోవ‌డంతో రాజ‌స్థాన్ జ‌ట్టు అత‌న్ని విడుదల చేసే అవకాశం ఉంది.

56
వనిందు హసరంగ
Image Credit : Getty

వనిందు హసరంగ

శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు అత‌ని నుంచి ఆశించిన స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు రాలేదు. 11 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు మాత్రమే సాధించగా, ఎకానమీ రేట్‌ 9.04గా ఉంది. జట్టు ఆయనను వేలానికి ముందు రిలీజ్‌ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

66
ఫజల్హాక్ ఫారూఖీ
Image Credit : ANI

ఫజల్హాక్ ఫారూఖీ

ఆఫ్గాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఫజల్హాక్ ఫారూఖీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది రాజ స్థాన్ రాయ‌ల్స్. ఆయన 5 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయారు. ఈ కారణంగా ఆయనను జట్టు నుంచి తప్పించటం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
Team India: ఇంగ్లాండ్ లో అద‌ర‌గొట్టేశారు.. టీమిండియాలో ముగ్గురు మొనగాళ్లు
Recommended image2
Rohit Sharma: 2027 వరల్డ్ కప్ కు టీమిండియా కొత్త ప్లాన్.. రోహిత్ శర్మ అవుట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved