MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే

Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే

Arjun Tendulkar Wedding : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి ప్రధాని మోదీ, అమిత్ షాలను స్వయంగా ఆహ్వానించారు. మార్చి 5న సాన్యా చందోక్‌తో అర్జున్ వివాహం జరగనుంది. పూర్తి వివరాలు ఇవే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2026, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అర్జున్ టెండూల్కర్ వివాహం : ప్రధాని మోదీకి ఆహ్వానం
Image Credit : X/sachin_rt

అర్జున్ టెండూల్కర్ వివాహం : ప్రధాని మోదీకి ఆహ్వానం

భారత క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సచిన్ కలిశారు. తన కుమారుడు అర్జున్, సాన్యా చందోక్ వివాహానికి రావాలని ప్రధానిని సచిన్ సాదరంగా ఆహ్వానించారు. సచిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాబోయే కోడలు సాన్యా కుటుంబ సభ్యులు కూడా ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. అలాగే, అమిత్ షాను కూడా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సచిన్ కలిసి పెళ్లి పత్రికను అందించారు. "మా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అర్జున్, సాన్యాల వివాహానికి ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. యువ జంటకు మీ ఆశీస్సులు, విలువైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మోదీజీ" అని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మార్చి 5న అర్జున్ టెండూల్కర్ గ్రాండ్ వెడ్డింగ్
Image Credit : X/sachin_rt

మార్చి 5న అర్జున్ టెండూల్కర్ గ్రాండ్ వెడ్డింగ్

అర్జున్ టెండూల్కర్ వివాహం ఈ ఏడాది మార్చి 5న జరగనుంది. పెళ్లి వేడుకలు మార్చి 3వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ వివాహ వేడుక ముంబైలో అత్యంత వైభవంగా, అదే సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రైవేట్ వేడుకగా జరగనుంది. గతేడాది ఆగస్టులో అర్జున్, సాన్యా చందోక్ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగింది. అప్పటి నుండి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ వివాహ వేడుకకు రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాని మోదీని సచిన్ స్వయంగా పిలవడంతో ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సచిన్ పంచుకున్న ఫోటోలలో ప్రధాని మోదీ నూతన వధూవరులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

34
ఎవరీ సాన్యా చందోక్?
Image Credit : instagram.com/saratendulkar

ఎవరీ సాన్యా చందోక్?

అర్జున్ టెండూల్కర్ భార్య కాబోతున్న సాన్యా చందోక్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. రవి ఘాయ్ గ్రేవిస్ గ్రూప్ అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ హోటల్ రంగం, ఆహార ఉత్పత్తుల రంగంలో భారీ వ్యాపారాన్ని కలిగి ఉంది. గ్రేవిస్ ఫుడ్ సొల్యూషన్స్ గతేడాది దాదాపు 624 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.

సాన్యా కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆమె ఒక క్వాలిఫైడ్ వెటర్నరీ టెక్నీషియన్ కూడా. ఆమె ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ అనే సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మూగజీవాలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అర్జున్, సాన్యాల పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

44
అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్
Image Credit : Getty + X

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్

సచిన్ వారసుడిగా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్. అర్జున్ తన కెరీర్‌ను ముంబై తరపున ప్రారంభించినప్పటికీ, మెరుగైన అవకాశాల కోసం గోవా జట్టుకు మారారు. ఇప్పటివరకు అర్జున్ 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడారు. తన అరంగేట్రం రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేసిన ఘనత అర్జున్ సొంతం.

ఐపీఎల్‌లో అర్జున్ ప్రయాణం ముంబై ఇండియన్స్‌తో మొదలైంది. 2021లో 20 లక్షల బేస్ ప్రైస్‌కు ఎంపికైన ఆయన, గాయం కారణంగా ఆ సీజన్ ఆడలేదు. ఆ తర్వాత 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భువనేశ్వర్ కుమార్‌ను అవుట్ చేయడం ద్వారా తన తొలి ఐపీఎల్ వికెట్‌ను సాధించారు. 2026 సీజన్ కోసం ఆయనను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved